అయితే సుహాసిని కెరీర్ మొదట్లో హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో ఇండస్ట్రీలో ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఇబ్బందులు చేదు జ్ఞాపకాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు .. ఆ సమయంలో సుహాసిని చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఇక సుహాసిని హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో ఒక్కొక్కసారి కొన్ని అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వచ్చేది. అలాంటి సమయాల్లో నేను కరాకండిగా తిరస్కరించే దాన్ని ఒక సినిమాలో హీరో ఒడిలో కూర్చున్నే సన్నివేశం చేయమని డైరెక్టర్ గారు చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు.
ఇక నేను చేయనని గట్టిగా చెప్పాను . అలాగే మరో సినిమాలో ఒక ఒక హీరో తిన్న ఐస్ క్రీమ్ ని తినమని కూడా అన్నారు.. వేరే వాళ్ళు తిన్న ఐస్ క్రీమ్ నేనెందుకు తినాలి అలా తినడం ఏంటి అని డైరెక్టర్ని ప్రశ్నించాను .. సుహాసిని చేసిన ఈ కామెంట్స్ అభిమానులు కొంతమంది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. కానీ మీరు నిర్మొహమాటంగా అలా మొహం మీద చెప్పేయడం వల్లనే సక్సెస్ఫుల్ ఇంకా ఇండస్ట్రీలో ఎలాంటి రిమార్క్ లేకుండా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించు కుంటున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు . ఇక ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరూ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కునే ఉంటారు.