ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్లో అద్వంతం శివన్న మాస్ యాక్షన్ ఎలివేషన్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. ప్రజల పక్షాన నిలబడే ఒక లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు.అలాగే కార్పొరేటర్స్ ఎదిగేందుకు చేస్తున్న పనులను సైతం శివన్న ఎలా అడ్డుకున్నాడు అనే విధానాన్ని చూపించారు.తన కెరియర్ లోనే ఒక పవర్ ఫుల్ రోల్ అన్నట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఇంతటి యాక్షన్స్ సన్ని వేషాలు తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
మైరా క్రియేషన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని బైరతి రణగల్ అనే టైటిల్ తో తెలుగు వర్షన్లో ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో రుక్మిణి వసంత్, అవినాష్, దేవరాజ్ రాహుల్ బోస్ తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. ట్రైలర్ లో భారీ యాక్షన్స్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తున్నాయి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం మొత్తానికి ట్రైలర్‌తో అయితే శివన్న ఆకట్టుకున్నప్పటికీ వాడు ఇండియా లెవెల్లో సక్సెస్ అవుతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం అయితే ట్రైలర్ వైరల్ గా మారుతున్నది.