ఈ క్రమంలోనే రాజకీయాలపై ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో నటి రోజా సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. ఇదిలా ఉండగా.... తాజాగా రోజా చాలా రోజులకి ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె తన వ్యక్తిగత విషయాలను అన్నింటినీ షేర్ చేసుకున్నారు. మా అమ్మానాన్నలు చనిపోయిన తర్వాత మా అన్నయ్యలు నన్ను కంటికి రెప్పలా చాలా బాగా చూసుకున్నారని రోజా అన్నారు.
సెల్వమని గారి సినిమా చేస్తున్న సమయంలోనే అతను నాకు లవ్ ప్రపోజ్ చేశారని ఈ రోజా చెప్పారు. నేను పెద్దగా మాట్లాడుతాను కానీ మా ఇంట్లో పెత్తనమంతా సెల్వమణి గారిదేనని రోజా చెప్పారు. సమరం సినిమాను వారి సొంత బ్యానర్ లో చేసామని రోజా చెప్పారు. ఆ సినిమా సమయంలో నాకు చాలా ప్రమాదం జరిగింది. దాంతో ఆ సినిమా పూర్తి కావడానికి, విడుదల చేయడానికి మాకు చాలా సమయం పట్టిందని రోజా అన్నారు. దానివల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడవలసి వచ్చిందని రోజా వెల్లడించింది.
కాగా, రోజాకి ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. తన కుమారుడు కౌశిక్ మంచి హైట్ ఉన్నాడని, ఇప్పటికైతే బాగా చదువుకుంటున్నాడని రోజా చెప్పింది. తనకు హీరో కావాలని కోరిక ఉందని రోజా అన్నారు. అలాగే డైరెక్షన్ పై కూడా మంచి ఇంట్రెస్ట్ ఉంది. దేవుడు ఆశీస్సులు ఉంటే మా అబ్బాయి తప్పకుండా హీరో అవ్వాలి అనుకుంటున్నాడని రోజా వెల్లడించింది. ప్రస్తుతం రోజా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.