కానీ నాగచైతన్య విడాకుల అనంతరం నటి శోభిత ధూళిపాళ్లతో సీక్రెట్ గా ప్రేమాయణం సాగించాడు. ఈ విషయం కొద్ది రోజుల క్రితమే బయటపడింది. చైతు, శోభిత ప్రేమ విషయాన్ని ఎక్కడ కూడా బయట పెట్టకుండా ఆగస్టు 8వ తేదీన ఎంగేజ్మెంట్ జరుపుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక వచ్చే నెలలో వీరి చైతు, శోభిత వివాహం జరగనుంది. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా.... నాగచైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ... పెళ్లిపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, నేను శోభితతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్టుగా నాగచైతన్య చెప్పాడు. శోభితతో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి నేను చాలా ఎదురు చూస్తున్నానని చైతు అన్నాడు. నేను తనతో చాలా డీప్ గా కనెక్ట్ అయ్యాను అంటూ చెప్పాడు. ఆమె నన్ను చాలా అర్థం చేసుకుంటుంది నాలో ఉన్న కాలిని భర్తీ చేస్తుందని చైతన్య వెల్లడించాడు.
నా వివాహం చాలా స్పెషల్ గా ఉండాలని అనుకుంటున్నానని చైతు అన్నాడు. దీంతో నాగచైతన్య చేసిన కామెంట్లపై నెటిజన్లు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. సమంత చైతుని అర్థం చేసుకోలేకపోయిందని అంటున్నారు. ఆమెతో చైతు జర్నీ సెట్ కాలేదని అర్థం వచ్చేలా చైతన్య మాట్లాడాడంటూ నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కారణంగానే నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి శోభితతో కనెక్ట్ అయ్యాడని సోషల్ మీడియాలో ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వార్తలోఏ మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం నాగచైతన్య మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి.