ఇటీవలే విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజాతో థియేటర్లలోకి వచ్చాడు. నితిన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 14వ తేదీన విడుదల అయింది. కేవలం 25 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇండియాలో 1000 కోట్లు వసూలు చేసింది. చైనాలో 500 కోట్లకు పైగా వసూలు చేయాలనే లక్ష్యంతో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఇటీవలే బ్లాక్ బస్టర్ అయినా కల్కి 2898AD, యానిమల్, కంగువా, సింగం, దేవర ఈ కేటగిరీలో లేవు. వీటి స్థానంలో ఓ చిన్న సినిమాను చైనా మార్కెట్ లో హవా సాగించేందుకు బరిలోకి వస్తోంది. మహారాజా సినిమా నవంబర్ 29న చైనాలో 40 వేల స్క్రీన్లలో విడుదల చేయనున్నారు. చైనాలో అత్యధిక వసూలు చేసిన భారతీయ సినిమాగా ప్రస్తుతం అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా రికార్డుల్లో ఉంది.
ఇది చైనా మార్కెట్ లో రూ. 1200 కోట్లకు పైనే వసూలు చేసింది. అమీర్ ఖాన్ వారసుడు జునైద్ నటించిన మహారాజా భారత దేశంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా కథ మంచి ప్రశంసలు అందుకుంది. ఇక మహారాజా సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కచ్చితంగా ఈ మూవీ చైనాలో 500 కోట్లకు పైగా వసూలు చేయాలని అంచనా వేస్తున్నారు.