ఆంధ్రాలో ఏ సినిమాకు అయిన ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. ఆ తర్వాత రెండో ప్లేస్‌లో నైజాం ఉంటుంది. ఇక మూడో స్థానంలో సీడెడ్ ఉంటుంది. కేవలం నాలుగు జిల్లాలు మాత్రమే ఉంటాయి. అక్కడ కూడా బాలయ్య లాంటి హీరోలకు ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. అయితే ఇప్పుడు పుష్ప 2.. ఈ మూడు ప్రాంతాల మధ్య సరిహద్దులు చేరిపివేసి.. సరికొత్త రికార్డు తన పేరిట లెక్కించుకుంది. ఆంధ్రను డామినేట్ చేసి.. నైజాంలో ఎక్కువ బిజినెస్ చేసింది. అసలు పుష్ప 2 సినిమాకు జరుగుతున్న బిజినెస్‌కు ఏ మాత్రం హద్దులు కనిపించడం లేదు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. ఈ సినిమాను ఆంధ్రాలో రూ.90 కోట్ల మేరకు బిజినెస్ చేశారు. అయితే నైజాం బిజినెస్ ఏకంగా రూ.100 కోట్ల మేరకు క్లోజ్ చేశారు.
నైజం ఏరియా హక్కులను మైత్రి నిర్మాణ సంస్థ.. తమ సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆయన మైత్రి సంస్థకు ఇచ్చింది. మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థకు వేరే భాగస్వాములు ఉన్నారు. అందులో మైత్రి నిర్మాణ సంస్థ కూడా ఉంది. అది వేరే సంగతి. ఏది ఏమైనా పుష్ప 2 నైజాంలో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ.210 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే తప్ప గిట్టుబాటు కాదు. అయితే ఇందులో రిఫండబుల్ అడ్వాన్స్ ఎంత ఉంది అన్నది తెలియదు. రూ.210 కోట్లు ఒక్క నైజాం నుంచి రాబట్టుకునేందుకు వీలైనంత మంచి టిక్కెట్ రేట్లు తెచ్చే ప్రయత్నం.. దాంతోపాటు వీలైనంత త్వరగా బుకింగ్ ఓపెన్ చేసే ప్రయత్నం ప్రారంభించారు. అలాగే వీలైతే నాలుగువ తేదీ 11 గంటలు లేదా.. 10 గంటల నుంచి షోలు ప్రారంభమించేలా ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల 24 గంటలలో వీలైనంత ఎక్కువ షోలు వేసుకోవచ్చు.