- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

సినిమా రంగంలో ఎన్నో ప్రేమ‌లు న‌డుస్తూ ఉంటాయి. చాలా మంది హీరోలు .. హీరోయిన్లు ప్రేమ‌లో ప‌డుతూ ఉంటారు.. డేటింగ్‌లు చేస్తూ ఉంటారు. కొంద‌రు డేటింగ్ లు చేసిన త‌ర్వాత విడిపోతూ ఉంటారు. మ‌రి కొంద‌రు అయితే ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకుని కాపురం చేసి విడిపోతూ ఉంటారు.. మ‌రి కొంద‌రు పిల్ల‌లు పుట్టాక విడిపోతూ ఉంటారు. మ‌రి కొంద‌రు అయితే ఏకంగా ద‌శాబ్దం పాటు కాపురం చేసి ఇద్ద‌రు .. ముగ్గురు పిల్ల‌లు పుట్టాక విడిపోతూ ఉంటారు. అస‌లు ఏఆర్ రెహ్మ‌న్ లాంటి వాళ్లు అయితే ఏకంగా 29 ఏళ్లు కాపురం చేసి ముగ్గురు పిల్ల‌ల‌కు త‌ల్లి దండ్రులు అయ్యి .. అది కూడా ఓ పిల్ల‌కు పెళ్లి చేశాక విడిపోయారు అంటే సినిమా వాళ్ల బంధాలు నీటి బుడ‌గ‌లు అన్న‌ది క్లీయ‌ర్ క‌ట్ గా తెలుస్తోంది.


ఇక టాలీవుడ్ లో నాగ‌చైత‌న్య  - స‌మంత జంట ఎంతో క్యూట్ క‌ఫుల్ గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్ద‌రి ప్రేమ నేష‌న‌ల్ వైడ్ గానే హైలెట్ అయ్యింది. 2010 నుంచి దాదాపు ఏడేళ్ల పాటు ఎంతో ఘాటుగా ప్రేమ‌లో ఉండి .. ఇష్టంగా ప్రేమించుకున్న ఈ జంట క‌లిసి నాలుగేళ్లు కూడా కాపురం చేయ‌కుండానే.. అది కూడా పిల్ల‌లు పుట్ట‌కుండానే విడిపోయారు. అస‌లు వీరిద్ద‌రు విడిపోవ‌డం దేశ సినీ రంగంలో నే ఓ సంచ‌ల‌నం అని చెప్పాలి. వీరు విడిపోవ‌డం ఎవ్వ‌రికి ఎంత మాత్రం ఇష్టం లేదు.


విచిత్రం ఏంటంటే పెళ్లి కి ముందు ఎంత క్యూట్ క‌ఫుల్ గా పేరు తెచ్చుకున్నారో ?  వీరి పెళ్లి ఎంత హైలెట్ అయ్యిందో.. విడిపోయాక అంత బ‌ద్ధ శ‌త్రువులు అయిపోయారు. ప‌రోక్షంగా ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల తూటాలు పేల్చేసు కుంటున్నారు. అందులోనూ స‌మంత అయితే ప‌దే ప‌దే ప‌రోక్షంగా చైతు పై వీలు ఉన్న‌ప్పు డ‌ల్లా సెటైర్లు పేల్చ‌డం.. విమ‌ర్శించ‌డం చేస్తూ వ‌స్తోంది. తాజాగా మ‌రోసారి త‌న మాజీ భ‌ర్త‌ను ఉద్దేశించి .. తాను త‌న మాజీకి చాలా విలువైన కానుక‌లు ఇచ్చాన‌ని సిటాడెల్ ప్ర‌మోష‌న్ల లో రెచ్చ‌గొట్టేలా .. చైతును కెలికేలా కామెంట్లు చేసింది.


చైతు కాస్త ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నా స‌మంత మాత్రం రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఏదేమైనా సినీ సెల‌బ్రిటీలు ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు ఒక‌రికి ఒక‌రం .. ఒక‌రు లేనిదే మ‌రొక‌రు లేరు అన్న‌ట్టుగా ఉంటారు. విడిపోయాక అంతే శ‌త్రువులు అయిపోతున్నారు. మ‌రి చిన్న చిన్న కార‌ణాల‌తో విడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: