శృతిహాసన్ లవ్ బ్రేకప్స్:
శృతిహాసన్ ఇప్పటివరకు ఎంతోమందితో ప్రేమలో పడిందని, ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుందని ఇప్పటికే మీడియాలో ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే కొన్ని రిలేషన్స్ ని శృతిహాసన్ బయట పెట్టలేదు. మరికొన్నేమో బయటపెట్టింది. అలా శృతిహాసన్ బయటపెట్టిన వాటిలో మ్యూజిక్ డైరెక్టర్ మైఖేల్ కోర్సలే ఒకరు.. అయితే వీరిద్దరికి సంబంధించిన ఎన్నో ప్రైవేట్ ఫోటోలు చక్కర్లు కొట్టడంతో వీరిద్దరి రిలేషన్ బయటపడింది. దాంతో ఈ విషయాన్ని బయటపెట్టిన శృతిహాసన్ కొద్ది రోజులకే అతనితో బ్రేకప్ చెప్పుకుంది. ఇక ఈయన తర్వాత శృతిహాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజరికతో ఉన్న రిలేషన్ ని బయటపెట్టింది. వీరిద్దరూ చాలా రోజులు ఒకే ప్లాట్ లో లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నారు. కానీ ఈ ఏడాది వీరి మధ్య ఏమైందో ఏమో తెలియదు కానీ బ్రేకప్ జరిగింది.ప్రస్తుతం శృతిహాసన్ సింగిల్గానే ఉంటున్నానని చెప్పింది.