నరేష్ పెళ్లిళ్లు:
విజయనిర్మల తనయుడు నరేష్ మొదట సీనియర్ కెమెరామెన్ అయినటువంటి శ్రీను కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి అన్యోన్య బంధానికి నవీన్ విజయ్ కృష్ణ అనే కొడుకు జన్మించాడు. ఈయనే నరేష్ పెద్దకొడుకు. ఆ తర్వాత నరేష్ సీనియర్ రచయిత అయినటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలైన రేఖ సుప్రియ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరి అన్యోన్య బంధానికి కూడా ఒక బాబు పుట్టారు. అయితే బాబు పుట్టాక ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇక నరేష్ మూడో పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు గత రెండు సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో రచ్చ సృష్టించిన రమ్య రఘుపతి. రమ్య రఘుపతి విజయనిర్మల దగ్గర పనిచేస్తూ ఆమె కొడుకు అయినటువంటి నరేష్ ని ప్రేమలో పడేసింది.అలా వీరిద్దరూ ప్రేమలో పడిన తీరుని మళ్ళీ పెళ్లి సినిమాలో చూపించారు.