అయితే ఈ సినిమాలోని ముఖ్యంగా రక్తపాతం గురించి తాజాగా హీరో రన్ బీర్ కపూర్ ఓ వేదికగా స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాజాగా ముంబైలోని ఓ ఈవెంట్ కి హాజరైన రన్బీర్ కపూర్ ని అక్కడ నిర్వాహకులు యానిమల్ సినిమాలోని రక్తపాతం గురించి ప్రశ్నించగా, రన్బీర్ మాట్లాడుతూ.... "ఖచ్చితంగా మీ మాటలతో ఏకీభవిస్తున్నాను. ఈ అంశాన్ని నేను దాటవేయలేను. యానిమల్ సినిమాలోని హింస, రక్తపాతం అనే అంశాలు హద్దులు దాటే చూపించడం జరిగింది. ఓ కళాకారుడిగా నేను ఎక్కువగా సమాజహతం కోరే సినిమాలే చేయవలసి ఉంటుంది. కానీ, సినిమాలు చేసే క్రమంలో అప్పుడప్పుడు వివిధ రకాలైన కథాంశాలను ఎన్నుకోవలసి ఉంటుంది. ఓ నటుడుగా అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు చేయవలసి వస్తుంది. అయితే వాటిని సినిమా వరకే చూడాలి. అంతేగాని సమాజానికి ఆపాదిస్తే దానికి మా దగ్గర సమాధానం దొరకదని చెప్పాలి." అంటూ బదులిచ్చాడు. ఇక ఆ సమాధానం విన్న జర్నలిస్టులు, అక్కడ ప్రేక్షకులు రన్బీర్ కపూర్ తో ఏకీభవిస్తున్నట్టు కరతాలధ్వనులు చేశారు.
ఇకపోతే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా, స్పిరిట్ అనే సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత యానిమల్ సినిమాకు కొనసాగింపుగా యానిమల్ పార్క్ అనే సినిమాని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే, యానిమల్ సినిమాలోని రక్తపాతానికి అవాక్కైన విమర్శకులు యానిమల్ పార్క్ సినిమా చూసి ఇక ఏమైపోతారో అని సోషల్ మీడియాలో నేటిజన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం హీరో రన్బీర్ కపూర్ తన తాత అయినటువంటి రాజ్ కుమార్ జీవితం పైన ఓ బయోపిక్ సినిమా తీయడానికి కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాని రన్బీర్ కపూర్ నిర్మిస్తాడా? లేదంటే నటిస్తాడా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.