అనుకున్న విధంగానే సక్సెస్ అయింది . పుష్ప2 సినిమాలోని ఐటెం సాంగ్ ఈ వేదికపై రిలీజ్ చేయడం హైలెట్గా నిలిచింది. మరీ ముఖ్యంగా తమిళ గడ్డపై బన్నీ తనదైన స్టైల్ లో పుష్పరాజ్ పూనినట్టు స్టెప్స్ వేయడం ఈవెంట్ కి హైలైట్ గా నిలిచింది. అయితే కొంతమంది మాత్రం బన్నీ టూ మచ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంటుంటే .. మరి కొంతమంది మాత్రం బన్నీ ఎందుకో ఓవర్ కాన్ఫిడెన్స్ గా బిహేవ్ చేస్తున్నాడు అన్న రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు . పుష్ప2 మ్యూజికల్ ఈవెంట్ చెన్నైలో జరగక ఆ స్టేజ్ పైకి వచ్చిన అల్లు అర్జున్ చాలా చాలా గంభీరంగా బోల్డ్ గా మాట్లాడారు .
అఫ్కోర్స్ ఏ పాన్ ఇండియా హీరో కైనా అది కామన్. అయితే బన్నీ పద్ధతి చూస్తుంటే మాత్రం కూసింత ఎక్కువ చేస్తున్నాడే అంటున్నారు జనాలు. మరీ ముఖ్యంగా బన్నీ మాట్లాడుతున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ కానీ స్టేజ్ కింద ఆయన కోసం ఫొటోస్ దిగడానికి వచ్చిన అభిమానులతో బిహేవ్ చేస్తున్న పద్ధతి గాని అస్సలు బాగోలేదు అంటున్నారు జనాలు . అంతేకాదు బన్నీ తాను ఎవ్వరి అండ చూసుకొని ఇండస్ట్రీలోకి రాలేదు అని తనకు తన ఫ్యాన్స్ అండ అని పరోక్షంగా పలు ఈవెంట్స్ లో చెప్పేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా హైలెట్ చేస్తున్నారు .
మరి ముఖ్యంగా బన్నీకి నేషనల్ అవార్డ్ వచ్చినప్పటి నుంచే ఈ చేంజెస్ బన్నీలో గమనిస్తున్నాం అంటున్నారు జనాలు . అయితే ఇది బన్నీ ఓవర్ కాంఫిడెన్స్ నా..? లేకపోతే ధైర్యమా..? అని జనాలు మాట్లాడుకుంటున్నారు. నిజంగానే బన్నీ కూఇసంత ఓవర్ చేస్తున్నాడు అని కొందరు ఘాటుగా మాట్లాడుతున్నారు. చూడాలి పుష్ప2 రిజల్ట్ తర్వాత బన్నీ బిహేవియర్ ఎలా ఉంటుందో ..?ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం బన్నీ ఫాన్స్ తో పాటు కామన్ పీపుల్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!