తెలుగు సిని ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్గా పేరుపొందిన విజయ్ దేవరకొండ, రష్మిక గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారనే వార్తలు ఎప్పటినుంచ ప్రచారంలో ఉన్నాయి.. వీటి పైన వీరిద్దరూ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ కూడా. వీరిద్దరి గురించి ఎక్కడ ఫోటోలు కనపడిన ఒకేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన కూడా అభిమానులు తెగ వైరల్ గా చేస్తూ ఉన్నారు. దీంతో అభిమానులు కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు.

అయితే ఇప్పుడు ఈ కల త్వరలోనే నిజం కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకు కారణం ఒక ఫోటో వైరల్ గా మారడంతో పాటు రష్మిక చేసిన కామెంట్స్ అందుకు నిదర్శనం అన్నట్లుగా సమాచారం. ఇటీవలే రష్మిక ,విజయ్ ఇద్దరు కూడా ఏదో రెస్టారెంట్లో కలిసి భోజనం చేస్తున్నట్లుగా ఫోటో వైరల్ గా మారింది. అలాగే విజయ్ దేవరకొండ కూడా తాను కొంతకాలం నుంచి ఒక కో స్టార్ తో డేటింగ్ చేస్తున్నారని చెప్పడంతో పాటుగా ఈ ఫోటో ఆ మరుసటి రెండు రోజుల్లో వైరల్ గా మారింది.


నిన్నటి రోజున రాత్రి పుష్ప-2 ఈవెంట్ చెన్నైలో చాలా గ్రాండ్గా జరిగింది ఈ వేడుకకు రష్మిక కూడా హాజరయింది. రష్మిక కూడా స్టేజ్ పైన మాట్లాడుతూ అప్పుడు రిలేషన్షిప్,పెళ్ళి పైన ఒక స్టేటస్ ని తెలియజేస్తుంది. రష్మిక మీకు ఇష్టమైన వ్యక్తి ఇండస్ట్రీ వ్యక్తినా లేకపోతే ఎలా అంటూ యాంకర్ అడగగా.. ఈ విషయం పైన రష్మిక ఇది అందరికీ తెలిసిన విషయమే అంటూ ఒక చిన్న చిరునవ్వుతో తెలియజేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ నవ్వుతూ కేకలు పెట్టారు. ఆ వెంటనే అటు అల్లు అర్జున్, శ్రీ లీల కూడా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. యాంకర్ ఏదైనా హింట్ ఇవ్వమని రష్మికను అడగగా ఆమె పర్సనల్ గా చెబుతాను అంటూ నవ్వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: