బాలీవుడ్ అమితాబచ్చన్ కొడుకుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అభిషేక్ బచ్చన్ సినిమాల్లో తండ్రుల రాణించలేకపోయాడు. హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు .. అయితే ప్రస్తుతం ఆభిషేక్‌ రెండు కారణాలతో వార్తల్లో హైలెట్గా నిలుస్తున్నాడు. ముందుగా ఆయన నటించిన ఐ వాంట్ టు టాక్ సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత అభిషేక్ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ఇక రెండోది భార్య ఐశ్వర్యరాయ్ నుంచి ఆయన విడిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అభిషేక్ - ఐశ్వర్య మ్యారేజ్ కి ముందు కుచ్ నా కహో, ధూమ్ 2, బంటీ ఔర్ బబ్లీ, గురు, సర్కార్ రాజ్ వంటి పలు సినిమాలో కలిసిన నటించారు. అయితే   పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ఏకైక సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రావణ్.. అయితే ఇది కూడా సరిగ్గా ఆడలేదు.


అయితే గతంలో ఐశ్వర్యరాయ్ భర్త అభిషేక్ తో కలిసి నటించడానికి నో చెప్పిందట .. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనేది ఇక్కడ చూద్దాం.. ఆ సినిమా మరేదో కాదు షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్‌.. 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. షారుక్ ఖాన్ ప్రధానపాత్రలో కనిపించిన ఈ సినిమాలో ఆయనతో పాటు అభిషేక్ బచ్చన్ , సోనూసూద్ , బోమన్ ఇరానీ, జాకీ షరీఫ్ , దీపికా పదుకొనే ముఖ్య పాత్రలో నటించారు . ఇక ఈ సినిమాను ఫరాఖాన్  తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో ఐశ్వర్య కు ఒక పాత్రను దర్శకులు ఆఫర్ చేశారు. అయితే దాని ఐశ్వర్య రిజెక్ట్ చేశారట కారణం భర్తతో కలిసి నటించడం ఇష్టం లేదట.


గతంలో ఓ ఇంటర్వ్యూ   ఇచ్చిన ఐశ్వర్యరాయ్ ఈ సినిమాని తిరస్కరించినట్లు ఆమె  చెప్పుకొచ్చారు. అలాగే దానిపై వివరణ ఇస్తూ.. నాకు ఆ సినిమాలో అవకాశం వచ్చింది..అయితే ఆ మూవీ నాకు ఒక ఫన్నీ మూవీల అనిపించింది .. చాలా సరదాగా గడుపుతామని, ఇది ఒక సరదా అనుభవం అవుతుందని నాకు తెలుసు .. ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ మేమిద్దరం ఎదురుగా కలిసి నటించిన ఇది నిజంగా చాలా వింతగా ఉంటుంది .. అందుకే ఆ సినిమాకు నో చెప్పానని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. గతంలో ఐశ్వర్య చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఐశ్వర్యారాయ్ - అభిషేక్ బచ్చన్ పేర్లు మరోసారి హాట్‌ టాపిక్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: