కృష్ణ , నాగేశ్వరరావు , శోభన్ బాబు , చిరంజీవి , బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు జంటగా ఎన్నో సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధానంగా చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో నటించి హిట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. ఇక గతంలో రాధిక కు హీరోలకు సమానంగా అభిమానులు ఉండేవారు. హీరో ఎవరైనా సరే రాధిక సినిమాలో ఉందంటే చాలు అభిమానులు థియేటర్లకు క్యూ కట్టేవారు. ఆ స్థాయిలో రాధిక అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత కొత్త తరం హీరోయిన్లు అడుగుపెట్టడంతో రాధిక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. హీరో హీరోయిన్ల కు తల్లి పాత్రలో ఎక్కువ నటిస్తున్నారు. ఇదే క్రమంలో నిర్మాతగా మరి పలు సీరియల్స్ ను సైతం ఆమె నటిస్తూ నిర్మిస్తున్నారు కూడా.. అయితే రాధిక వ్యక్తిగత జీవితం ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. రాధిక తండ్రి ఎంఆర్ రాధ .. ఆయనకు తమిళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది.
ఎంఆర్ రాధ నాటక రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు .. అయితే ఆయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుని అప్పట్లోనే సంచలనం సృష్టించారు. నాటకాలు వేసే సమయంలో అనేక ప్రాంతాలకు వెళ్లేవారు ఆయన ఆ సమయంలో పలువురు అమ్మాయిలతో ప్రేమలో పడటం వారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక చివరిగా గీత అనే శ్రీలంక మహిళను పెళ్లి చేసుకున్నారైన వీరికి పుట్టిన సంతానమే రాధిక.. రాధికకు ఓ చెల్లెలు కూడా ఉంది ఆమె పేరు నిరోష.. ఆమె కూడా సినిమాల్లో నటించి పాపులర్ అయింది .. ఇక రాధిక తండ్రికి మొత్తం 12 మంది పిల్లలు ఉన్నారు.అదే విధంగా.. రాధికకు కూడా మూడు పెళ్లిళ్లు అయ్యాయి. 1985లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, నటుడు ప్రతాప్ పోతెన్‌ను వివాహం చేసుకున్నారామె. చేసుకుంది. అయితే పెళ్లి అయిన కొద్ది రోజులకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రిచర్డ్ హార్డిని రాధిక పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకున్న రాధిక.. 9 ఏళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపారు. ఇక 2001లో అప్పటి స్టార్ హీరో.. శరత్ కుమార్‌ను మూడో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తోంది.