సత్యదేవ్ హీరోగా రూపొందిన జీబ్రా , విశ్వక్సేన్ హీరోగా రూపొందిన మెకానిక్ రాఖీ సినిమాలు మంచి అంచనాల నడుమ నవంబర్ 22 వ తేదీన విడుదల అయ్యాయి. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి ఈ రెండు రోజుల్లో ఈ రెండు సినిమాలకు ఏ స్థాయి కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యేసరికి జీబ్రా మూవీకి నైజాం ఏరియాలో 60 లక్షల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్లో 70 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు రోజుల్లో 1.30 కోట్ల షేర్ ... 2.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ దక్కాయి. ఇక రెండు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో 40 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా 1.70 కోట్ల షేర్ ... 3.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 5.50 టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ మరో 3.80 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేస్తే క్లీన్ హిట్గా నిలుస్తుంది.

రెండు రోజుల్లో మెకానిక్ రాఖీ సినిమాకు నైజాం ఏరియాలో 90 లక్షల కలెక్షన్ దక్కగా , ఆంధ్రప్రదేశ్లో 1.10 కోట్ల కలెక్షన్లు దక్కాయి మొత్తంగా ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు రోజుల్లో 2 కోట్ల షేర్ ... 3.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ దక్కాయి. రెండు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకొని 45 లక్షల కలెక్షన్లు దక్కాయి. ఇక రెండు రోజులు ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 2.45 కోట్ల షేర్ .. 4.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ 9 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 6.55 కోట్ల మీరా షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: