సమంత రెండో పెళ్లి వార్తలు చాలా రోజుల నుండి వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా నిజం కాలేదు.అయితే తాజాగా సమంత రెండో పెళ్లి వార్తలు బీ టౌన్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. మరి ఇంతకీ సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది ఎవరయ్యా అని అంటే ఓ హీరోయిన్ మాజీ బాయ్ ఫ్రెండ్ తో సమంత రెండో పెళ్లి అని, అందుకే ఆ హీరోహీరోయిన్ కి బ్రేకప్ చెప్పినట్టు రూమర్లు వినిపిస్తున్నాయి.ఇక విషయంలోకి వెళ్తే.. సమంత బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ కొడుకు అయినటువంటి అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉందని, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని,త్వరలోనే సమంత అర్జున్ కపూర్ ని పెళ్లి చేసుకొని బోని కపూర్ ఇంటికి కోడలుగా వెళ్ళబోతుంది అంటూ బీటౌన్ లో పుకార్లు వినిపిస్తున్నాయి.. అయితే రీసెంట్ గా బోనికపూర్ తన ప్రియురాలు అయినటువంటి మలైకా అరోరాకి బ్రేకప్ చెప్పినట్టు వార్తలు వినిపించాయి.

అయితే ఇవి అన్ని రూమర్సే అనుకున్నారు. కానీ అర్జున్ కపూర్ నేను సింగల్ అంటూ చెప్పారు. దాంతో మలైకాతో తన బంధాన్ని తెంచేసుకున్నారని అందరూ భావించారు. అయితే ఓవైపు మలైకాతో విడిపోయిన కొద్దిరోజులకే సమంతతో పెళ్లి వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో అర్జున్ కపూర్ సమంతతో ప్రేమలో ఉండడం వల్లే మలైకా అరోరాకి బ్రేకప్ చెప్పినట్టు ఊహగాణాలు స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే రీసెంట్ గా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో ఒక మంచి కవితని పోస్ట్ చేసింది.అయితే సమంత పెట్టిన పోస్ట్ కి ఆకర్షితుడయ్యాడో ఏమో తెలియదు కానీ అర్జున్ కపూర్ చాలా ఆదర్శంగా ఉంది అంటూ రిప్లై ఇచ్చేసరికి వీరి మధ్య పెళ్లి వార్తలు డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి. 

సమంత అర్జున్ కపూర్ మధ్య చాలా రోజుల నుండి పరిచయం ఉందని,వీరిద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ బీటౌన్ లో జోరుగా పుకార్లు వైరల్ అయ్యేసరికి సమంత రెండో పెళ్లి వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి.అసలు పెళ్లి చేసుకోను అంటున్న సమంత పై వస్తున్న ఈ రూమర్స్ లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక అర్జున్ కపూర్ కూడా ఈ రూమర్ పై ఇప్పటివరకు స్పందించలేదు. తోటి సెలబ్రిటీ లాగా అర్జున్ కపూర్ సామ్ కి రిప్లై ఇచ్చారా లేక నిజంగానే వీరి మధ్య ఏదైనా సంబంధం ఉందా అనేది తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: