మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి త్రిష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ కొనసాగించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సోషియో ఫాంటసీ మూవీ లో చిరంజీవి కి జోడి గా నటిస్తుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై చిరు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే త్రిష కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ బ్యూటీ వరుస పెట్టి అద్భుతమైన క్రేజ్ ఉన్న తమిళ సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ వస్తుంది. ఇక ఈ బ్యూటీ కి ఫుల్ క్రేజ్ ఉండడంతో కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా ఈమె అడిగినంత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈమె కొంత కాలం క్రితం ఈమె తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా రూపొందిన లియో అనే సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కోసం ఈమె ఏకంగా 6 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు ఓ వార్త అప్పట్లో తెగ వైరల్ అయింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న  థగ్ లైఫ్ అనే సినిమాలో నటిస్తోంది. ఇక ఈ మూవీ కోసం ఈ బ్యూటీ ఏకంగా 12 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక కోలీవుడ్లో ఇప్పటివరకు నయనతార ఎక్కువ పారితోషకాన్ని తీసుకుంటున్నట్లు ఆమెను త్రిష బీట్ చేసినట్లు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇలా ఈ బ్యూటీ ఒక్కో సినిమా కోసం అదిరిపోయే రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: