అయితే ఈ సినిమా టైటిల్ కు కథకు ఏ మాత్రం పొంతన లేదని అభిమానులలో చాలామంది ఫీలవుతారు. సినిమాలో ఒకే ఒక్క డైలాగ్ ద్వారా టైటిల్ విషయంలో ప్రేక్షకులను కన్వీన్స్ చేయడానికి ప్రయత్నం జరిగినా ఆ ప్రయత్నం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా అయితే లేదు. రామయ్యా వస్తావయ్యా మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చినా అప్పట్లో ఈ సినిమా 35 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
సినిమాలో ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ విషయంలో కొన్ని పొరపాట్లు ఈ సినిమాకు మైనస్ అయ్యాయని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కెరీర్ లో టైటిల్స్ విషయంలో అప్సెట్ చేసిన సినిమాలు తక్కువ కాగా ఆ సినిమాలలో రామయ్యా వస్తావయ్యా ఒకటి కావడం గమనార్హం. రామయ్యా వస్తావయ్యా రిలీజ్ తర్వాత తారక్ సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఒకింత అప్సెట్ అయ్యారు.
ఈ సినిమాలో శృతిహాసన్ పల్లెటూరి యువతి పాత్రలో నటించగా ఆమె యాక్టింగ్ ఈ సినిమాకు మైనస్ అయింది. రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో భారీ షాకులిచ్చిన సినిమాలు అని చెప్పవచ్చు. ఈ సినిమాలు నిర్మాతలను సైతం నిలువునా ముంచేశాయి. అయితే ఈ సినిమాల తర్వాతే జూనియర్ ఎన్టీఆర్ కథల ఎంపికలో మారారని చెప్పవచ్చు.