•వెండితెరపై ఫెయిల్యూర్ అయినా బుల్లితెరపై సక్సెస్ఫుల్ మూవీ..
•మహేష్ మొదటిసారి చేసిన అల్లూరి సీతారామరాజు పాత్ర..
మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అతడు. మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో హరే రామ హరే కృష్ణ అనే చిత్రాన్ని కూడా చేయడం జరిగిందట.. ఈ చిత్రానికి నిర్మాత ఎమ్మెస్ రాజు. కొద్ది రోజులపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చేయించారట. సంగీతానికి దేవిశ్రీప్రసాద్ ను కూడా అనుకున్నారట.అయితే కొన్ని కారణాలు చేత సినిమా నుంచి తప్పుకున్నారట దేవిశ్రీప్రసాద్.
నిజానికి అప్పటికి 80 కోట్ల రూపాయల వరకు ఈ సినిమాకి బడ్జెట్ అనుకోవడంతో ఎమ్మెస్ రాజు ఈ విషయాన్ని గ్రహించడంతో ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టారట. ఆ తర్వాత ఎమ్మెస్ రాజు సినిమాలన్నీ కూడా వరుసగా ప్లాపులు అవ్వడంతో చివరికి హరే రామ హరే కృష్ణ ప్రాజెక్ట్ ని కూడా పక్కన పెట్టేశారట. ఆ వెంటనే మహేష్ బాబుకి పోకిరి సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఆ సమయంలో మళ్ళీ తెరమీదకి హరే రామ హరే కృష్ణ సినిమాని తీద్దామనుకున్నప్పటికీ.. రవితేజ తో వీడే వంటి సినిమాని నిర్మించిన సింగనమల రమేష్.. మహేష్, త్రివిక్రమ్ చిత్రం తీయాలని అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట.
ఆ వెంటనే సి కళ్యాణ్ కూడా రావడంతో ఖలేజా సినీ ప్రయాణం అక్కడి నుంచి మొదలైందట. జయ శ్రీ ప్రసాద్ బిజీగా ఉండడంతో అతని ప్లేస్ లో మణిశర్మని తీసుకోవడం జరిగింది.. మొదట హీరోయిన్గా పార్వతి మిల్టన్ ని అనుకొని కొంత భాగం షూటింగ్ చేసినా.. కొన్ని కారణాల చేత ఆమె తప్పుకోవడంతో అనుష్క ను హీరోయిన్ గా తీసుకున్నారట. అలా 60 శాతం భాగం షూటింగ్ కూడా రాజస్థాన్లోని ఇసుక ప్రాంతంలోనే చేశారు దీంతో టీం కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. మొదట ఈ చిత్రానికి "దైవం మనుష్య రూపేనా" అనే వర్కింగ్ టైటిల్ని కూడా అనుకున్నారట. మహేష్ కు ఉన్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని మొదట ఈ చిత్రాన్ని ఖిలాడీగా మార్చారు..ఆ తర్వాత కొద్ది రోజులకి పూర్తిగా ఖలేజాగా మారిపోయిందట.
అయితే అప్పట్లో ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా చాలా గొడవలు జరిగాయట. ఫైనల్ గా 2010 అక్టోబర్ 7న ఈ సినిమా విడుదలై.. నెగిటివ్ టాక్ ని మూట కట్టుకుంది. ఖలేజా అనే టైటిల్ కి ఈ సినిమా కథకి ఎలాంటి సంబంధం లేదని, కేవలం దేవుడు కాన్సెప్ట్ పెట్టారని , ఓ రేంజ్ లో అభిమానులు త్రివిక్రమ్ పైన కూడా ఫైర్ అయ్యారట. కానీ ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఇప్పటికీ బుల్లితెర పైన ఖలేజా సినిమా ప్రసారమయితే టాప్ రేటింగ్ లో దూసుకుపోతోంది. ఇందులో మహేష్ బాబు అల్లూరి సీతారామరాజు అనే పాత్రలో నటించారు. ది బెస్ట్ గా నటించడం జరిగింది. ఇంటర్వెల్ సన్నివేశం కూడా హైలెట్ గా ఉందని, కానీ వెండితెర పైన ఫెయిల్యూర్ గా మిగిలిపోయినా.. బుల్లితెర పై సక్సెస్ అందుకుంది ఖలేజా చిత్రం.