టాలీవుడ్ డైరెక్టర్లు తమ సినిమాల కథలకు, అసలు ఏమాత్రం సంబంధం లేకుండా టైటిల్స్ పెట్టారు.ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ విషయంలో టైటిల్ పాత్ర కూడా ఎంతో ఉంటుంది. ముందుగా సినిమా టైటిల్ బట్టే ఆ సినిమా పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. అయితే టాలీవుడ్లో కొన్ని సినిమాలకు అసలు కథకు టైటిల్ కు సంబంధం లేకుండా వచ్చాయి. అంతేకాకుండా అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్దకొన్ని అనుకోకుండా సక్సెస్ అయితే మరికొన్ని బోల్తా కొట్టాయి.ఈ నేపథ్యంలో రాంచరణ్ నటించిన రచ్చ మూవీ ఒకటి. అసలు విషయానికొస్తే మగధీర సక్సెస్ తర్వాత రామ్ చరణ్ తన ప్రాజెక్ట్‌ను తమ ఫ్యామిలీ ఓన్ ప్రొడక్షన్ అంజనా ప్రొడక్షన్స్‌లో నాగబాబు నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ సినిమా చేసారు. లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన  ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్‌ ఎక్కువగా ఖర్చు పెట్టడంతో పాటు పూర్తి క్లాస్ మూవీ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆరెంజ్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ సినిమా చేసారు. అంతకు ముందు సంపత్ నందిపెద్దగా అనుభవం లేని దర్శకుడితో రామ్ చరణ్ సినిమా చేస్తుండంతో అందరు ఈ సినిమాపై అనుమానాలు వ్యక్తం చేసారు.

మరోవైపు రామ్ చరణ్.. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై కాజల్ హీరోయిన్‌గా ‘ధరణి’ దర్శకత్వంలో ‘మెరుపు’ సినిమాను ప్రారంభించాడు. కానీ ఆ సినిమా కొంత భాగం షూటింగ్ తర్వాత  మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత ఈ బ్యానర్‌లో రామ్ చరణ్ ‘రచ్చ’  సినిమా చేసాడు.సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘రచ్చ’ మూవీ 2012 ఏప్రిల్ 5న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. రెగ్యులర్ మాస్ రివేంజ్ స్టోరీ అనే టాక్ వచ్చింది.అయితే ఈ కథకు, టైటిల్ కు ఏ సంబంధమూ ఉండదు. అయినా  ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది.రచ్చ మూవీలో రామ్ చరణ్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు తమన్నా గ్లామర్ పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది.ఈ సినిమాలో మరోసారి రామ్ చరణ్ తన తండ్రి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలోని వాన వాన వెల్లువాయే పాటను రీమిక్స్ చేసాడు. మణిశర్మ ఇచ్చిన ట్యూన్ ఈ పాట మాస్‌లోకి బాగా వెళ్లింది. ఏమైంది ఈ వేళ అనే ఒకే ఒక సినిమాను తెరకెక్కించాడు.ఇక రాంచరణ్, శంకర్ దర్శకత్వం లో చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ విడుదల కు సిద్ధం గా వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: