ఇది ఇలా ఉండగా ప్రిన్స్ మహేష్ బాబు చాలా సినిమాలలో... కొన్ని సక్సెస్ అయితే కొన్ని అట్టర్ ప్లాప్ అయ్యాయి. కొన్ని మామూలుగా ఆడాయి. అలాంటి వాటిలో స్పైడర్ సినిమా ఒకటి. స్పైడర్ సినిమా చాలామందికి నచ్చింది. కానీ సినిమా మాత్రం యావరేజ్ టాక్.. మాత్రమే తెచ్చుకోగలిగింది. ప్రిన్స్ మహేష్ బాబు అలాగే ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఈ సినిమా పూర్తిగా క్రైమ్ అండ్ సస్పెన్స్ నేపథ్యంలోనే వచ్చింది. అయితే టైటిల్ కు సంబంధం లేకుండా ఈ కథను రూపొందించారు. స్పైడర్ అని పేరు వినగానే మనకు స్పైడర్ మాన్ సినిమా గుర్తుకువస్తుంది. లేదా స్పైడర్ అనే టైటిల్ వినగానే... అంతరిక్షం, టెక్నికల్ నేపథ్యంలో సినిమా వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు విషయం బయటపడింది. ఈ సినిమా కంప్లీట్లీ క్రైమ్... నేపథ్యంలో వచ్చిందని చెప్పవచ్చు.
ఇందులో ఎస్ జె సూర్య.. విలన్ పాత్రలో చేసి ఇరగదీశాడు. భైరవుడు అనే పాత్రలో నటించిన ఎస్ జె సూర్య... ఓ సైకో కిల్లర్. జనాలు ఏడుస్తుంటే సంబర పడిపోయే పాత్ర అతనిది. జనాలు సంతోషంగా ఉండకుండా ఎవరినో ఒకరిని చంపేసి....వాళ్ళు ఏడుస్తుంటే ఆనందించేవాడు ఎస్ జె సూర్య.ఇక విలన్ ను ఎలా పసిగడతాడు...? అతన్ని ఎలా మహేష్ బాబు చంపేస్తాడు అన్నది కథ. అందుకే ఈ సినిమా కథకు సంబంధం లేకుండా టైటిల్ ని ఫిక్స్ చేశారు. దీనిపై అప్పట్లో ట్రోలింగ్ బాగానే జరిగింది.