కర్ణుడు చావుకి ఎన్నో లక్షల కారణాలు ఉంటాయి అన్నట్లు ఒక సినిమా విడుదలై ఫ్లాప్ అయ్యాక కూడా ఫ్లాప్ కి కారణం కూడా అనేకం ఉంటాయి. ఆ విధంగానే ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ మూవీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎందుకు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.. ఎక్కడ మైనస్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం.

 టైటిల్ కి సినిమాకి పోలిక లేదు:


 అసలు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఆయనకు సెట్ అవ్వలేదు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ కి ఇలాంటి కథ సెట్ అవ్వకపోవడం పెద్ద మైనస్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ సినిమా అంటే అందులో కథ వేరే లెవెల్ ఉంటుంది అని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా లేదు.ఇలాంటి సాదాసీదా కథలో మామూలు హీరో అయితే సెట్ అవుతారు. కానీ పాన్ ఇండియా హీరో అయినా మా ప్రభాస్ అన్న అస్సలు సెట్ అవ్వలేదని ప్రభాస్ ఫ్యాన్స్ పెదవి విరిచారు. ఈ సినిమాలో ప్రభాస్ పూజ హెగ్డే కాకుండా టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు ఎంతో మంది భారీ తారాగణం ఉన్నారు.కానీ ఆ క్యారెక్టర్ ఆర్టిస్టుల క్యారెక్టర్స్ ని డైరెక్టర్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు.ఇది కూడా సినిమాకి మైనస్ అని చెప్పుకోవచ్చు.ఈ సినిమాలో నటి భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా సెట్ అవ్వలేదు.


అలాగే పూజ హెగ్డే తండ్రికి అసలు డైలాగ్సే లేవు. కానీ పూజ హెగ్డే తండ్రి పాత్రలో చేసిన మురళి శర్మ పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్.అలాగే స్టార్ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న జగపతిబాబుకి ఈ సినిమాలో రెండు సీన్లు మాత్రమే ఉన్నాయి.ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ ఉండడం కాదు వారిని సరిగా ఉపయోగించుకోవాలి.కానీ ఈ సినిమాలో వారిని సరిగ్గా వాడుకోలేదు డైరెక్టర్.రాధే శ్యామ్ మూవీ స్టోరీ కూడా చాలా ఓల్డ్ ది. 2004లో రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు విడుదలైంది. ఈ స్టోరీ లైన్ 2004లోనే అనుకున్నారట.అయితే 2004లో ఈ స్టోరీ లైన్ గొప్పదే అవ్వచ్చు. కానీ ఇప్పటి జనరేషన్ వాళ్ళ మైండ్ సెట్ మారింది.వాళ్లు సినిమాల్లో కొత్తదనం కోరుకుంటారు. కాబట్టి ఓల్డ్ కథని ప్రేక్షకులు తీసుకోలేకపోయారు. 

రాధే శ్యామ్ మూవీ ప్రేమకి విధికి జరిగిన యుద్ధం లాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కింది. అయితే ఈ సినిమా అచ్చం నాగార్జున నటించిన గీతాంజలి సినిమాను పోలి ఉంది.కానీ గీతాంజలి సినిమాలో హీరో హీరోయిన్ కి సెట్ అయినట్లుగా రాధే శ్యామ్  సినిమాలో ప్రభాస్ కి పూజ హెగ్డే కి సెట్ అవ్వలేదు.ప్రభాస్ సినిమా అంటే ఆయన అభిమానులు యాక్షన్ ఎపిసోడ్స్ ని ఎక్కువగా కోరుకుంటారు. కానీ ఈ సినిమాలో అసలు విలనే లేడు.యాక్షన్స్ సన్నివేశాలు లేవు. కేవలం డెస్టినీ అనే పదాన్ని విలన్ గా తీసుకున్నాడు. మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ప్రభాస్ కి రాధేశ్యామ్ సినిమా అస్సలు సెట్ అవలేదు. ముఖ్యంగా స్టోరీ లైన్ కి తగ్గట్టు సినిమా టైటిల్ లేదు. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది

మరింత సమాచారం తెలుసుకోండి: