సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇక బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు ఫ్లాప్ గా మిగులుతాయి. ఇంకొన్ని సినిమాలు మాత్రం సూపర్ హిట్ లు సాధిస్తూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంటాయి. కొన్ని స్టోరీస్ తో చిరాకు తెప్పిస్తే.. ఇంకోటి సినిమాలు టైటిల్ తోనే విసుగు తెప్పిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే సినిమా టైటిల్ అనేది కథకు సరిగ్గా సరిపోయే విధంగా ఉండాలి. కానీ కథకు కథనానికి సంబంధం లేకుండా కొంతమంది డైరెక్టర్లు సినిమా టైటిల్ పెడుతూ ఉంటారు.


 దీంతో టైటిల్ చూసి ఏదో ఉంది అనుకుని థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులు అసలు సినిమా చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక ఇలాంటివి టాలీవుడ్ లో కూడా చాలానే ఉన్నాయి. అయితే నాగచైతన్య హీరోగా నటించిన 'దడ' సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. అజయ్ బుయాన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా 'దడ' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటికే నాగచైతన్యకు వరుసగా రెండు సూపర్ హిట్స్ ఉండడంతో ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నావ్. ఇక 'దడ' అంటూ టైటిల్ కూడా పవర్ ఫుల్ గా ఉండడంతో సినిమా మరో రేంజ్ లో ఉంటుందని థియేటర్కు వెళ్లారు ప్రేక్షకులు.


 థియేటర్కు వెళ్లాక గాని అర్థం కాలేదు 'దడ' టైటిల్ అర్థమేంటి అని. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టడమే 'దడ'. నష్టాలు వస్తాయి అని తెలిసిన సినిమా నిర్మించిన నిర్మాతలకు 'దడ'. ఇలా నాగచైతన్యకు రెండు హిట్స్ తర్వాత దడ పుట్టించే సినిమా అంటూ ఇక ఈ సినిమా టైటిల్ పై ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. సినిమాలో ఉన్న కథ ఏంటి అసలు మీరు పెట్టిన టైటిల్ ఏంటి అని సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులు అందరూ కూడా ఇక బయట ట్రోలింగ్ చేసేసారు. అప్పట్లో సోషల్ మీడియా ఇంతలా ప్రభావితం లేదు కానీ ఇక ఇప్పటిలా అప్పుడు సోషల్ మీడియా ఉండుంటే మాత్రం నాగచైతన్య విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొనేవాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: