జూనియర్ ఎన్టీఆర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో కంత్రి, శక్తి సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి నిరాశపరిచాయి. శక్తి సినిమా అయితే ఏకంగా 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా నిర్మాతలకు తీవ్రస్థాయిలో నష్టాలను మిగిల్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను శక్తిహీనుల్ని చేసిన మూవీ శక్తి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
 
సినిమా హిట్టవుతుందని భావించిన అభిమానులు సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో పాటు నిర్మాతలకు ఏకంగా 25 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమా నష్టాల గురించి చాలా సందర్బాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ సైతం పలు సందర్భాల్లో ఈ సినిమా గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ సినిమా మిగిల్చిన చేదు జ్ఞాపకాలను ఫ్యాన్స్ మరవలేరని చెప్పవచ్చు.
 
శక్తి సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. శక్తి సినిమా ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ కథ, కథనం విషయంలో జరిగిన పొరపాట్లు ఈ సినిమాకు మైనస్ అయ్యాయని చెప్పవచ్చు. హీరోయిన్ ఇలియానాకు సైతం ఈ సినిమా ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా తర్వాత ఇలియానాకు మూవీ ఆఫర్లు తగ్గాయని చెప్పవచ్చు.
 
ఎన్టీఆర్ ఈ సినిమాలో రెండు రోల్స్ లో నటించగా ఒక పాత్ర విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను మెప్పించే విషయంలో దర్శకుడు మెహర్ రమేష్ ఫెయిల్ అయ్యారని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కథల ఎంపికలో మార్పు రావడానికి కారణమైన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి అని చెప్పవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించి మరిన్ని ఘన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: