క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఖడ్గం సినిమా అప్పట్లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. హిందూ,ముస్లిం సమైక్యతను, భారత దేశ సమగ్రతను చాటి చెబుతూ కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కించారు. నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రశంసలు సైతం ఖడ్గం సినిమాకు దక్కాయి. శ్రీకాంత్,ర‌వితేజ, ప్ర‌కాష్ రాజ్ ముగ్గురు హీరోలు క‌లిసి ఈ సినిమాలో న‌టించారు.ఇదిలావుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే ఓ సాంగ్‌లో కొద్దిసేపు న‌టించ‌డం ఈ సినిమాకు హైలెట్‌. అలాగే కిమ్ శ‌ర్మ కూడా న‌టించింది. ఈ సినిమాలో హీరోయిన్ సంగీత సినిమా అవకాశాల కోసం దర్శకుడితో బెడ్ రూమ్ లోకి వెళ్లాల్సిన సీన్ ఉంది. ఈ నేపథ్యంలో సంగీత రవితేజ ను ప్రేమిస్తున్న సంగతి తెలుసుకున్న సంగీత అమ్మ అయిన పావలా శ్యామల తన కూతురును హీరోయిన్ చేయాలన్న కోరికతో ఆమె బలవంతంతో అయిష్టంగానే సంగీతను ఆ దర్శకుడితో రూమ్‌లోకి పంపిస్తుంది. ఆ దర్శకుని ఒడిలో కూర్చొని అతడికి మందు తాగిస్తుంటుంది.అయితే ర‌వితేజ త‌లుపు తోసుకు వ‌చ్చి ఆ సీన్ చూసి విల‌విల్లాడిపోతాడు.సినిమా రంగంలో సహజంగా హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితి ఉంటుందని కృష్ణవంశీ కూడా ఆ సీన్ అందుకే పెట్టారని అప్పట్లో టాక్ వచ్చింది. అప్పట్లో ఇండస్ట్రీలో జరిగిన ప్రచారం ఏంటంటే టాలీవుడ్లో ఓ సీనియర్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ ను టార్గెట్ చేసే క్రమంలోనే కృష్ణవంశీ ఈ సీన్ కావాలని పెట్టారని అంటారు.నిజానిజాలు ఏంటన్నది తెలియదు కానీ ఆ స్టార్ డైరెక్టర్ రమ్యకృష్ణను ఓ సినిమా షూటింగ్‌లో ఇబ్బంది పెట్టిన క్రమంలోనే కృష్ణవంశీ కావాలనే ఆయనను టార్గెట్ చేస్తూ ఖడ్గం లో ఈ సీన్ క్రియేట్ చేశారని ప్రచారం కూడా జరిగింది.ఇక ఆ తర్వాత రమ్యకృష్ణ సైతం ఇండస్ట్రీలో ఓ న‌టి స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే తప్పకుండా దర్శక, నిర్మాతలకు లొంగి పోవాల్సిందే అని వారు ర‌మ్మ‌న్న గ‌దుల్లోకి వెళ్ళాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: