టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప 2. వచ్చేనెల 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ 2 సినిమాకు ఇప్పటికే విపరీతమైన బజ్ ఉంది. ఏ స్థాయిలో ఉందో కానీ..విని.. ఎరుగని రీతిలో ఉంది. ఎవరు ఊహించలేకపోతున్నారు. ఈ సినిమా టీజర్ సూపర్ డూపర్ హిట్. ట్రైలర్ ఇంకా సూపర్ డూపర్ హిట్. పాటలన్నీ అభిమానులను మెప్పిస్తున్నాయి. ఈ బజ్ చూస్తుంటే.. తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర రికార్డు బ్రేక్ చేయడం ఖాయం అనిపిస్తోంది. ఇంత బజ్ ఉన్నా సినిమాకి ఇప్పుడు వైసీపీ పబ్లిసిటీ చేసి పెడుతోంది.
వైసీపీ నేత అంబటి రాంబాబు పుష్ప 2 సినిమాకి తన వంతుగా ప్రమోషన్లు .. ఎలివేషన్లు ఇస్తున్నారు. పార్ట్ 1 అద్భుతంగా ఉందని.. హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ చేస్తారని.. పార్ట్ 2 కోసం అందరితో పాటు తాను కూడా ఎదురు చూస్తున్నానని ప్రకటించారు. అంబటి రాంబాబు ఏమిటి ..? సినిమా ప్రమోషన్లు చేయడం ఏమిటని అనుకున్నారా ..? గత ఎన్నికల్లో వైసీపీకి పరోక్షంగా , ప్రత్యక్షంగా అల్లు అర్జున్ మద్దతు ఇచ్చారు. నంద్యాల వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. అప్పుడు వైసీపీకి.. బన్నీ సపోర్ట్ చేశాడు. ఇప్పుడు బన్నీ సినిమాకు వైసీపీ సపోర్ట్ చేస్తుంది.
అది అసలు విషయం. పైగా బన్నీ సినిమాపై జనసేన కార్యకర్తలు కాస్త కక్షతో ఉన్నారు. ఈసారి బన్నీ సినిమాకు తమ సపోర్ట్ చేసేది లేదని పవన్ ఫ్యాన్స్ మొహం మీద చెప్పేస్తున్నారు. జనసేన ఎడ్డెం అంటే తెడ్డెం అనడం వైసీపీ పాలసీ కాబట్టి.. వాళ్లు బన్నీకి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ వాళ్లు.. చంద్రబాబు, లోకేష్, బాలయ్య టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి.. సహజంగానే దేవరకు కూడా వైసీపీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిజంగా వైసీపీకి సినిమా పరిశ్రమపై అంత ప్రేమ ఉంటే.. ఎందుకు వాళ్ళ ఐదేళ్లు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ఇండస్ట్రీని అసలు పట్టించుకోలేదు.. పుష్ప పార్ట్ 1కు రేట్లు పెంచలేదు అన్నది అందరికి తెలిసిన విషయమే.