సరోగసి ద్వారా నయనతార - విగ్నేష్ ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు అయ్యారు . అప్పట్లో ఈ వార్త కూడా పెద్ద కాంట్రవర్షియల్ గా మారి గవర్నమెంట్ నుంచి లీగల్ నోటీసులు అందుకొని దానికి క్లారిటీ కూడా ఇచ్చే అంత చిక్కుల్లు ఎదుర్కొంది. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ళకి సోషల్ మీడియాలో ఆమె హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ కి గురవుతుంది. దానికి కారణం ధనుష్ పై ఆమె మాట్లాడిన మాటలు . ధనుష్ 10 కోట నష్టపరిహారం డిమాండ్ చేశాడు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతూ సోషల్ మీడియాలో పెద్ద పెద్ద పోస్టులు చేసేసింది . కోలీవుడ్ మీడియా మొత్తం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వైపే ఉంది కానీ నయనతార వైపు అస్సలు లేదు. దీంతో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఈమెకి నెగిటివిటి ఏర్పడింది అంటూ తెలుస్తుంది .
సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించబోయే "స్పిరిట్" సినిమాలో నయనతార హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు అంటూ బాగా వార్తలు వినిపించాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత వీళ్ళ కాంబో సెట్ కాబోతుంది అంటూ కూడా జనాలు భావించారు. అయితే ధనుష్ తో జరిగిన వ్యవహారంతో ఫుల్ సీరియస్ అయిపోయిన సందీప్ రెడ్డివంగా ఈ ప్రాజెక్టు నుంచి ఆమెను తప్పించారట . ప్రజెంట్ ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. నయనతార హెడ్ వెయిట్ కి ఇది బాగా గుణపాఠం అంటున్నారు కొంతమంది జనాలు . అయితే నయనతార ఈ సినిమా నుంచి కాదు కోలీవుడ్లో మరో రెండు ప్రాజెక్ట్స్ నుంచి కూడా మేకర్స్ తీసేసారు అంటూ ప్రచారం జరుగుతుంది . నయన్ నోటి దూకుడు కారణంగానే ఇలా అయ్యింది అంటున్నారు జనాలు. ఆమె ధనుష్ పై సీరియస్ కాకుండా ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అంటున్నారు జనాలు . చూడాలి మరి దీనిపైన నయనతార ఏవిధంగా స్పందిస్తుందో..??