మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు .. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని చిత్ర పరిశ్రమలో అడిగి పెట్టాడు రామ్ చరణ్.. చిరుత , మగధీర వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా వరుస‌ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజ‌ర్  సినిమాతో వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  రాబోతున్నాడు.


అయితే ఇప్పుడు రామ్ చరణ్ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించారు .. అలా వచ్చిన వాటిలో కొన్ని హిట్ అయ్యాయి మరికొన్ని ప్లాప్‌ అయ్యాయి. మరి కొన్ని యావరేజ్ సినిమాలుగా మిగిలిపోయాయి. అలాంటి సినిమాలలో వినయ విధేయ రామ కూడా ఒకటి. రామ్ చరణ్ వినయ విధేయ రామ కొంతమందికి నచ్చింది కానీ సినిమా మాత్రం యావరేజ్ టాక్ తో మిగిలిపోయింది. రామ్ చరణ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో చరణ్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ హీరో కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే.


సినిమా పక్క బోయపాటి మార్కక్‌ యాక్షన్ నేపథ్యంలో వచ్చింది. అయితే సినిమాకు టైటిల్ కు సంబంధం లేకుండా ఈ కథను రూపొందించారు. వినయ విధేయ రామ అనే పేరు వినగానే ఫ్యామిలీ సినిమా అని అందరూ అనుకుంటారు.. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. సినిమా కంప్లీట్ యాక్షన్ నేపథ్యంలో వచ్చింది. ఇందులో బాలీవుడ్ స్టార్ వివేక్ ఓబెరాయ్ విలన్ గా నటించాడు. బోయపాటి మార్క్ లాజిక్ లెస్ స్టోరీ తో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఆర్యన్ రాజేష్ , హరీష్ ఉత్తమ్న్‌, ప్రశాంత్ వంటి వారు కీలకపాత్రలో నటించారు. లాజిక్ లెస్‌ స్టోరీ తో రామ్ చరణ్ తో బోయపాటి తీసిన ఈ మాస్ మూవీ చరణ్ కు రంగస్థలం లాంటి భారీ హీట్ తర్వాత భారీ డిజాస్టర్ గా మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: