తమిళ హీరో సిద్ధార్థ్ గురించి తెలుగు జనాలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బేసిగ్గా తమిళ వాడు అయినప్పటికీ, మొదట్లో ఆయన చేసిన సినిమాలకు మన తెలుగు సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో ఆయన చేసిన బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నే వద్దంటానా అనే సినిమాలు తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూలు సాధించడంతో ఇక్కడ ఆయనకి తిరుగులేని స్టార్డం దక్కింది. ఇక ఆ సినిమాల తర్వాత హీరో సిద్ధార్థ తెలుగు హీరోల సరసన చేరాడు. అయితే ఆ తర్వాత కాలంలో ఆయన చేసిన సినిమాలు పెద్దగా ఆడక పోవడంతో హీరో సిద్ధార్థ కి ఇక్కడ కాస్త మార్కెట్ తగ్గిందనే చెప్పుకోవాలి. ఇక అడపాదడపా సినిమాలో ఆయన చేసినప్పటికీ అవి తమిళ సినిమా అనువాదాలు కావడం విశేషం. ఆ సినిమాలు కూడా ఇక్కడ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఆల్మోస్ట్ ఇక్కడ సిద్ధార్థ మార్కెట్ పడిపోయింది.

అసలు విషయంలోకి వెళ్తే, సిద్ధార్థ హీరోగా, ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో తమిళ అనువాదం "మిస్ యు" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దాంతో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు సదరు చిత్ర యూనిట్ తాజాగా హైదరాబాదులో నిర్వహించగా హీరో సిద్ధార్థ ఈ సందర్భంగా, చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇకముందు గాని, ఇప్పుడు గాని ఆయన లవ్ స్టోరీ కు సంబంధించిన సినిమాలు అస్సలు చేయనని, కేవలం క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలను మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ... నేను స్టార్ హీరోని కాదని, ఒక నటుడిగా మాత్రమే నన్ను ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటానని చెప్పుకొచ్చాడు. ఒక మంచి నటుడిగా ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకుంటానని, అంతకు మించిన పెద్ద కోరికలు లేవని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఒక తెలంగాణ అల్లుడుగా హైదరాబాదు వచ్చానని, హీరోయిన్ అతిధి హైదరీని పెళ్లి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా వెల్లడించాడు హీరో సిద్ధార్థ్.

మరింత సమాచారం తెలుసుకోండి: