అయితే ఈ సంవత్సరం ఒక ఏఆర్ రెహమాన్ మాత్రమే కాదు .. మరో రెండు జంటలు కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి కోలీవుడ్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఒకే ఏడాది మామ , అల్లుళ్లు ఏఆర్ రెహమాన్ , జీవీ ప్రకాష్ తమ వివాహ జీవితానికి బ్రేక్ ఇచ్చారు . సింగర్ సైంధవితో తన 11 ఏళ్ల రిలేషన్ కు ఎండ్ కార్డ్ వేసాడు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ . మ్యూజిక్ తో ప్రేక్షకులను ఉరూతలు ఊగించే ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తన లైఫ్ లోను చేదు బాణీలు మిగించుకున్నాడు . అలాగే ఎంతో అన్యోన్యంగా కనిపించే మరో కోలీవుడ్ స్టార్ జంట జయం రవి - ఆర్తి విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక తమ 15 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. భార్య ఆర్తి ఇబ్బంది పెట్టడం వల్లే జయం రవి - ఆర్తి నుంచి విడాకులు కోరుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో ఓ టాక్ వైరల్ గా మారింది.
వీరే కాకుండా గతంలో ధనుష్ -ఐశ్వర్య, నాగచైతన్య - సమంత , అమలాపాల్ - ఏఎల్ విజయ్ విడాకుల న్యూస్ కోలీవుడ్ ఫాన్స్‌ను తెగ బాధపెట్టాయి. ఎన్నో రోజులు కలిసి ఉన్న ఇద్దరి మధ్య సరైన అండర్ స్టాండింగ్, ఒకరినొకరు సరిగా నమ్మకపోవడం వర్క్‌లో పడి ఫ్యామిలీని పట్టించుకోకపోవడం, కొరవడిన ప్రేమ అనురాగాలు ఈ కఠిన నిర్ణయానికి కారణమవుతున్నాయి అన్నది కొంత మంది వాదన . ఇది పూర్తి పర్సనల్ మేటర్ అని కవర్ చూసుకుంటున్నప్పటికీ సెలబ్రెటీల లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే ప్రతి ఇండియన్ ఇలాంటి వార్తలను జీర్ణించుకోలేకపోతున్నారన్నది వాస్తవం .