బన్నీపై ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ అందరికీ తెలిసిందే . ఒకటి కాదు రెండు కాదు దాదాపు 5 నెలల నుంచి సోషల్ మీడియాలో బన్నిపై విపరీతంగా ఒక సర్టెన్ బ్యాచ్ ట్రోలింగ్ చేస్తూ ఆయన ఏం చేసినా సరే దానికి పెడ అర్ధాలు తీస్తూ ట్రోల్ చేస్తూ వస్తున్నారు . అయితే రీసెంట్ గా బన్నీ పుష్ప2 సినిమాకి సంబంధించిన స్పెషల్ సాంగ్ రిలీజ్ అయింది . చెన్నై వేదికగా ఈ సాంగ్  ను బాగా ఖర్చుపెట్టి మరి రిలీజ్ చేశారు . పాట కూడా పర్వాలేదు అనే టాక్  దక్కించుకుంది.  సమంత "ఊ అంటావా మావ " పాట అంత లేదు కానీ..ఒకసారి అయితే చూడొచ్చు . సినిమాకి కొంచెం ప్లస్ గానే మారే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు జనాలు . అయితే కొంతమంది మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . ఇది ఇలా ఉండగా బన్నీ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది .


అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీని పోస్ట్ చేశారు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ మళ్ళీ ఆ పోస్ట్ డిలీట్ చేసి ఇంకొక ఫోటో తన స్టోరీలో పెట్టుకున్నాడు.  దీనితో ఇప్పుడు అందరి కళ్ళు దాని పైన పడ్డాయి . అయితే ఎందుకు బన్నీ అలా చేశాడు..? అని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బన్నీ ఫ్యాన్స్ కి మధ్య ఎలాంటి జరుగుతుందో అందరికీ తెలిసిందే. అయితే చెన్నై వేదికగా జరిగిన పుష్ప2 వైల్డ్ ఫైర్ మ్యూజికల్ ఈవెంట్లో శ్రీలీలతో కలిసి దిగిన ఫోటోను బన్ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు .



అయితే ఆ పిక్ లో వెనకాల దూరంగా కనిపించే ఒక వ్యక్తి ఒక పెద్ద ఫ్లెక్సీ పట్టుకుని ఉంటాడు . ఆ పేపర్లో "ఏం పీకలేరు పీకె బ్రో" అనే విధంగా రాసి ఉంటుంది . అయితే బన్నీ తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ ఆ ఫోటోని తన ఇన్స్టా  స్టోరీలో పెట్టుకువచ్చారు . దీంతో వెంటనే రియలైజ్ అయిన బన్నీ ..మళ్లీ పిక్ డిలిట్ చేసి.. ఆ ఫోటోని క్రాప్ చేసి బన్నీ - శ్రీలీల ఉండే ఫోటో వరకే షేర్ చేశారు . త సోషల్ మీడియాలో ఇప్పుడు బన్నీ పెట్టిన పోస్ట్ బాగా హాట్ గా ట్రెండ్ అవుతుంది .  బన్నీ చూసి పెట్టాడా ..? కావాలని చూసి కూడా చూసి చూడన్నట్టు వదిలేసాడా..? మళ్లీ ఎందుకు డిలీట్ చేశాడు ..? ఎందుకులే ఈ రాధ్హంతం అనుకున్నాడా..? అందుకే  డిలీట్ చేసి మంచి పని చేశాడా..? ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు కొంతమంది సినీ ప్రముఖులు . అయితే మరి కొంత మంది మాత్రం బన్నీ కావాలని అలా చేసి పోస్ట్ డిలీట్ చేశాడు అని ..అప్పటికే ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అయిపోయిందని మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: