ఇదే మూమెంట్ లో స్టేజి పైకి వచ్చిన రష్మికని హోస్ట్లు తన బాయ్ ఫ్రెండ్ గురించి ప్రశ్నించగా టక్కున టంగ్ స్లిప్ అవుతూ "ఆ విషయం అందరికీ తెలిసిందే" అన్న రేంజ్ లో విజయ్ దేవరకొండ పేరు కన్ఫామ్ చేసేసింది . అప్పుడే విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా ఓ రెస్టారెంట్లో ఫుడ్ తింటున్న ఫోటో కూడా బాగా ట్రెండ్ అయ్యి వైరల్ అయింది. దీనితో త్వరలోనే రష్మిక మందన్నా- విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.
అయితే అంత పెద్ద ఈవెంట్ లో అంత పెద్ద స్టేజిపై అలా రష్మిక మందన్నా పరోక్షకంగా విజయ్ దేవరకొండ ని లవర్ గా కన్ఫర్మ్ చేయడం విజయ్ దేవరకొండ తల్లికి బాగా కోపం తెప్పించిందట. అందుకు సీరియస్ కూడా అయిందట . "ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకొని కన్ఫర్మ్ చేయాలి.. మీ సినిమా కోసం నీ పబ్లిసిటీ కోసం నువ్వు ఆ విషయాన్ని బయట పెట్టేసావ్. నెక్స్ట్ విజయ్ దేవరకొండ సినీ కెరియర్ ఏంటి? ఇప్పుడు విజయ్ దేవరకొండ కి సినిమా అవకాశాలు అంతలా వస్తాయా ..? ఇదే విధంగా ఒకవేళ విజయ్ దేవరకొండ చేసుంటే నువ్వు ఒప్పుకునే దానివా..? అంటూ కాల్ చేసి మరి విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్నా పై ఫైర్ అయ్యిందట విజయ్ దేవరకొండ తల్లి.
ఆఫ్ కోర్స్ విజయ్ దేవరకొండ తల్లి బాధలో న్యాయం ఉంది అంటున్నారు జనాలు. విజయ్ దేవరకొండ ఈ మధ్యకాలంలో హిట్ కొట్టలేదు . ప్రజెంట్ కమిట్ అయిన సినిమాలు ఆయనకి హిట్ అవ్వడం ఆయన కెరీర్ కి ఎంతో కీలకము . మరి ఇలాంటి మూమెంట్ లో ఇద్దరు రిలేషన్ లో ఉన్నాము అంటూ అనఫిషియల్ గా కన్ఫామ్ చేసేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. మరొక పక్క ఇద్దరు ఇప్పటికైనా రిలేషన్ ని కన్ఫామ్ చేశారు అందుకు హ్యాపీ అంటూ సంబరపడుతున్నారు..!