దర్శకులు అనేవాళ్ళు.. సినిమాకు కెప్టెన్ లాంటి వాళ్లు. ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన.. బ్లాక్ బస్టర్ హీట్ అయిన.. పాన్ ఇండియా హిట్ అయిన.. సహజంగా ఆ పేరు హీరోలకు వస్తుంది. అలాగే హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లకు వస్తూ ఉంటుంది. కానీ.. అంతిమంగా ఆ సినిమా జయపజయాలకు పూర్తి బాధ్యత వహించాల్సింది దర్శకుడు మాత్రమే. దర్శకుడు సృజనాత్మకత మీదే సినిమా జయపజయులు ఆధారపడి ఉంటాయి. కొందరు ఎంతో మంచి పేరు ఉన్న దర్శకులు కూడా.. తమ పని తాము చేయకుండా.. సైడ్ బిజినెస్ మొదలు పెట్టేస్తున్నారు. అక్కడే తేడా కొడుతోంది. ఆ దర్శకుల క్రేజ్ మొత్తం దిగజారిపోతుంది.


త్రివిక్రం.. అరవింద సమేత, అల వైకుంఠ‌పురంలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత మంచి సినిమాలు తీయటం మానేసి.. పవన్ కళ్యాణ్ కు సినిమాలు సెట్ చేసి పెట్టడం, కథా, స్క్రీన్‌ ప్లే, మాటలు ఇవ్వడం.. కాస్త రెమ్యూనరేషన్ వెనకేసుకోవడం మొదలుపెట్టాడు. ఫలితంగా గుంటూరు కారం డిజాస్టర్ అయింది. కొరటాల శివ దర్శకుడుగా.. సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. అయితే తన సినిమాలకు ఎంత వసూళ్లు వస్తాయో లెక్కలు వేసుకుని.. బిజినెస్ విషయంలో ఎప్పుడైతే వేలుపెట్టాడో.. ఆచార్య డిజాస్టర్ అయింది. మళ్ళీ దేవర విషయంలో తన తప్పు తెలుసుకున్నాడు.


మారుతి కూడా మంచి హిట్ సినిమాలు చేసినప్పుడు.. ఇతర సినిమాలకు కథలు ఇవ్వటం, నిర్మాతగా మారటం, ఇతర సినిమాలకు స్క్రీన్‌ప్లే ఇవ్వటం మొదలుపెట్టాడు. వెంటనే మారుతి క్రేజ్ దిగజారిపోయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్‌, ప్రశాంత్ వర్మ కూడా అదే పని చేస్తున్నారా.. వారి సైడ్ బిజినెస్ వారిని దెబ్బ కొట్టబోతుందా అంటే.. అవునన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్‌, ప్రశాంత్ వర్మ మంచి ఫామ్ లో ఉన్నారు. వాళ్ళ సినిమాలు తీయటం మానేసి.. వాళ్ళ దగ్గర ఉన్న కథలు అమ్ముకోవడం.. బాగా సమ్ము చేసుకోవడం మొదలుపెట్టారు. భగీర సినిమాకు ప్రశాంత్ నీల్ కథ‌ అందించాడు.


అలాగే ప్రశాంత్‌ వర్మ.. దేవకీ నందన వాసుదేవ సినిమాకు కథ‌ అందించాడు. వీళ్ళు పేర్లు యాడ్ అవటం వల్ల.. ఈ సినిమాలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసాయి. వీళ్ళు రెండు మూడు కోట్లు వస్తాయని కథలు అమ్ముకోవటం ఎప్పుడు అయితే మొదలుపెట్టారో.. ఆ సినిమాలు ఎప్పుడైతే ప్రేక్షకులకు తిరస్కారానికి గురవుతున్నాయో.. ఈ పాన్‌ ఇండియా డైరెక్టర్ల క్రేజ్ మసక‌బారటం మొదలుపెట్టింది. ఇలాంటి సైడ్ వ్యాపారాలు పక్కన పెట్టకపోతే.. ఎంత గొప్ప డైరెక్టర్ అయినా ఫేడ్ అవుట్ అయిపోతారన్నది వీళ్ళు తెలుసుకోవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: