సినీ సెలెబ్రిటీల విడాకులు అంశం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎంతలా సంచలనాలు సృష్టిస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఎన్నో రోజులపాటు కలిసి మెలిసి బ్రతికిన స్టార్లు విడాకులు తీసుకొని వేరు పడటానికి సిద్ధమైపోతున్నారు. ఇక ఎన్నో ఏళ్ల దాంపత్య జీవితానికి స్వస్తి పలికేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య, సమంత.. ఐశ్వర్య, ధనుష్ ఇలా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీ  జంటలు విడాకులు తీసుకున్నాయి. అయితే ఇంకొంతమంది కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు తెరమీదకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


ఇలా సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్లు కూడా చేరిపోయారు అన్న విషయం తెలిసిందే. స్టార్ కపుల్స్ గా పేరు ఉన్న ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇది నిజమా కాదా అనే విషయంపై ఇప్పటికి కూడా అందరిలో కన్ఫ్యూజన్ నెలకొంది. ఎందుకంటే కొన్నిచోట్ల విరిద్దరి మధ్య వివాదాలు ఉన్నట్లే మేసులుకుంటున్న అభిషేక్,, ఐశ్వర్య.. ఇంకొన్ని చోట్ల మాత్రం కలిసి కనిపిస్తున్నారు. దీంతో విడాకుల వార్తలు వైరల్ గా మారడం ఇది నిజమా కాదా అని అందరూ కన్ఫ్యూజన్లో పడిపోవడం పరిపాటిగా మారిపోయింది.


 ఇలా ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యరాయ్ గురించి చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. ఒక రకంగా విడాకుల వార్తలకు ఇక అభిషేక్ కామెంట్స్ చెక్ పెట్టేసాయి అని చెప్పవచ్చు. నేను బయటకు వెళ్లి సినిమాలు చేయగలుగుతున్న అంటే ఇంట్లో ఐశ్వర్య ఉంది అన్న ధైర్యమే. అందుకు నేను ఎంతగానో అదృష్టవంతుడిని. అందుకే ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న. పిల్లలు కూడా తండ్రిని మూడో వ్యక్తిగా చూడరు. ఎందుకంటే పిల్లలకు పేరెంట్స్ ఇద్దరు ఒక్కటే అంటూ అభిషేక్ కామెంట్ చేశాడు  దీన్ని బట్టి ఒక రకంగా వీరిద్దరూ కలిసే ఉన్నారని అన్యోన్యంగా ఉన్నారు అన్న విషయం పై ఒక క్లారిటీ వచ్చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: