పుష్ప 2 సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాదని.. మరికొందరు మ్యూజిక్ డైరెక్టర్లను ప్రాజెక్టులోకి తీసుకువచ్చారు. నిర్మాతలు అయినా మైత్రి మూవీస్ వాళ్ళు నిర్మాతల టెన్షన్ నిర్మాతలది. రూ.1000 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాను అనుకున్న టైం కు పక్కా ప్లానింగ్ ప్రకారం రిలీజ్ చేయకపోతే.. చాలా నష్టం జరుగుతుంది. ఏకంగా రూ.1000 కోట్ల బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. అందుకే వాళ్ళు దేవిశ్రీ నేపథ్య సంగీతం ఇవ్వటంలో బాగా ఆలస్యం చేస్తున్నాడని.. మనోడిని పక్కనపెట్టి మరో ముగ్గురు సంగీత దర్శకులను తీసుకువచ్చి సినిమాని పార్ట్ పార్ట్‌లుగా విభజించి మరీ.. వాళ్లతో బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించుకున్నారు.
ఇది దేవి శ్రీని బాగా హర్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ విషయంలో బన్నీ ఎంత కన్విన్స్ చేసిన నిర్మాతలు ఒప్పుకోలేదు అని సమాచారం. అయితే సుకుమార్‌కు దేవిశ్రీకి మధ్య ఎంతో అనుబంధం ఉంది.. ఈ క్రమంలోనే సుకుమార్, దేవిశ్రీ హర్ట్ అవకుండా ఉండేందుకు బన్ని ఈవెంట్లో దేవిశ్రీని ఆకాశానికి ఎత్తేశాడు. దేవిశ్రీ, బన్నీ బాయ్ అండ్.. మై డార్లింగ్ అంటూ తెగ ప్రేమ కురిపించాడు. అటు బన్నీ అయితే తాను నటించిన పదికి పైగా సినిమాలుకు దేవి శ్రీనే సంగీతం అందించాడని.. అతడు లేకపోతే తాను లేను అన్నట్టుగా చెప్పాడు. పుష్ప 2లో నేపథ్య సంగీతం కోసం మరో ముగ్గురు సంగీత దర్శకులను తీసుకువచ్చిన బన్నీ.. దేవిశ్రీ మధ్య బంధాన్ని పెద్దగా దెబ్బతీయలేదు అన్న కలరింగ్ ఇచ్చేందుకు బన్నీ నాన్నా తంటాలు పడ్డాడు.
దేవిశ్రీకి, మైత్రికి మధ్య ఉన్న గొడవలు సర్దుబాటు చేసేందుకు స్టేజ్ మీద బన్నీ చాలా కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. బన్నీ ఇప్పుడు ఎంత ప్రయత్నించినా.. తన తర్వాత సినిమాలకు కూడా దేవిశ్రీ ని రిపీట్ చేస్తే.. అప్పుడు వీరిద్దరి స్నేహం మరింత స్ట్రాంగ్ గా ఉందన్న క్లారిటీ వస్తుంది. అయితే అది ఎప్పటికప్పుడు సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే బన్ని తర్వాత సినిమా త్రివిక్రమ్ తో ఉంటుంది. అక్కడ త్రివిక్రమ్ ఉన్నాడు కాబట్టి.. దేవి శ్రీ ఉండడు అనేది అందరికీ తెలిసిన విషయమే. కచ్చితంగా అక్కడ థమన్ ఉంటాడు. ఏది ఏమైనా మళ్లీ బన్నీ.. దేవిశ్రీ కలిసి పనిచేస్తే చాలా పుకార్లకు క్లారిటీ ఉంటుంది.