ఆసలు విషయం ఏమిటింటే గతంలో బాలయ్య సరసన హీరోయిన్గా అవకాశం వస్తే యంగ్ హీరోయిన్లు కూడా నటించడానికి ఒకే చెబుతున్నారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం బాలయ్యతో నటించడని మొహం మీదే నో చెప్పిందట. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం. బాలయ్య- వినాయక్ కాంబోలో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్యకు జంటగా టబు, శ్రియా నటించారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జంటగా ముందుగా టబు ప్లేస్ లో స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణని అనుకున్నారట .
ఇదే విషయన్ని రమ్యకృష్ణకు చెప్పడంతో ఆమె నో చెప్పిందట. దానికి ముఖ్య కారణం బాలకృష్ణ సినిమాలో ద్విపాత్రభినయం చేసినప్పుడు బాలయ్య తండ్రి పాత్రకు రమ్యకృష్ణని హీరోయిన్గా అనుకున్నారట. కానీ రమ్యకృష్ణ ఆ పాత్రకు నో చెప్పిందట. ఎందుకంటే ఆమె ఆ సమయానికి సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ సమయంలో బాలకృష్ణకు తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించాల్సి వస్తే తన సినీ కెరీర్ పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట. ఆ తర్వాత ఆ పాత్రకి హీరోయిన్ టబుని తీసుకున్నారు. అలాగే కొడుకు పాత్ర పక్కన హీరోయిన్ గా శ్రియని తీసుకున్నారు. ఇక సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.