నాగచైతన్య రెండో పెళ్లి నాగార్జునకి కొత్త చిక్కులు తీసుకొచ్చింది అన్న వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి . నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు . కేవలం కొద్ది రోజులే మరికొద్ది రోజుల్లోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో వీళ్ల పెళ్లి చాలా ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుంది . అయితే ఇప్పటికే చాలామంది స్టార్స్ ను నాగార్జున - నాగ చైతన్య స్వయంగా ఆహ్వానించారు . ఇప్పుడు నాగార్జునకి పెద్ద సమస్య వచ్చి పడింది. నాగార్జున కి పొలిటికల్ పరంగా కూడా ఫ్రెండ్స్ ఉన్నారు.



వాళ్ళల్లో చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు . అయితే ఇప్పుడు నాగార్జున కి కొత్త తలనొప్పి వచ్చింది. నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల రెండో పెళ్లికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పిలవాలా ..? వద్దా..? అన్న సందిగ్ధంలో పడిపోయారు. పిలిస్తే ఒక తలనొప్పి.. పిలవకపోతే మరొక తలనొప్పి.  పిలిస్తే రేవంత్ రెడ్డి తో పాటు కేసీఆర్ ను కేటీఆర్ ని కూడా పిలవాలి . అది ఎంత తలనొప్పి అయినా వ్యవహారమో అందరికీ తెలిసిందే .



పిలవకపోతే హైడ్రా పేరుతో ఎన్ కన్వెన్షన్ కూల్చింది రేవంత్ ఏ కాబట్టి అందుకే పిలవలేదు అన్న పేరు వస్తుంది . అది అక్రమ కట్టడం అన్న విషయం కూడా బయటపడిపోతుంది . ఒకవేళ రేవంత్ రెడ్డి ని పిలవకుండా కేటీఆర్ కెసిఆర్ ని పిలిస్తే అది ఇంకా తలనొప్పి . ఇదొక సమస్య అయితే ఇక ఏపీలో చంద్రబాబును పెళ్ళికి పిలవాలా..? వద్దా..? ఏపీ సీఎం కాబట్టి  పిలిస్తేనే బాగుంటుంది. ఒక్క వేళ్ల చంద్ర బాబు ని పిలిస్తే  జగన్తో ఉన్న సత్సంబంధాలు తెగిపోతాయి . జగన్ అదేవిధంగా నాగార్జున దోస్తులు . ఒకవేళ జగన్ ని పిలవకుండా సీఎం చంద్రబాబును పిలిస్తే ఒక తలనొప్పి ..సీఎం చంద్రబాబుని మాజీ సీఎం జగన్ ఇద్దరిని పిలిస్తే అదొక తలనొప్పి.. ఒక్క వేళ్ల పిలిచినా వాళ్లు రాకపోతే అది అక్కినేని ఫ్యామిలీకి షాక్ అవుతుంది.  ఈ క్రమంలోని ఎవర్ని పిలవకుండా పొలిటిషియన్స్.. ఈ పెళ్లికి రాకుండా చేసేయాలి అంటూ డిసైడ్ అయిపోయారట.  లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకొని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లిలో టెన్షన్ క్రియేట్  చేయడం కన్నా కూడా అసలు ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకోవడం బెటర్ అంటూ ఫిక్స్ అయిపోయారట . దీంతో నాగచైతన్య - శోభిత  ధూళిపాళ్ళ పెళ్లికి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: