కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే విషయం హైలైట్ గా మారింది. శోభిత ధూళిపాళ్ళ - నాగచైతన్య పెళ్లి పూర్తిగా బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో జరగబోతుందట . అంతేకాదు ఈ పెళ్లి కోసం ఎనిమిది గంటల పాటు శోభితా ధూళిపాళ్ల నాగచైతన్య పెళ్లి పీటలపైనే కూర్చొని పూజలు కూడా చేస్తారట. ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీలో ఏ హీరో కూడా ఇంత పద్ధతిగా ఇంత ఆచార వ్యవహారాలను హైలెట్ చేస్తూ పెళ్లి చేసుకునిందే లేదు ..నాగచైతన్య ఇంత పద్ధతిగా ఈ పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పడంతో ఈ జంట పేర్లు హైలెట్ గా మారాయి.
రీసెంట్గా సమంత..తన మాజి భర్త నాగచైతన్య పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం. మీరు అనవసరంగా దేనికైనా ఎక్స్పెన్సివ్స్ గా ఖర్చు పెట్టారా..? అన్న ప్రశ్నకు సమంతా నా ఎక్స్ కి అంటూ చెప్పి షాక్ ఇవ్వడం అదేవిధంగా విడాకులపై ఆమె స్పందిస్తూ మాట్లాడడం అభిమానులకి షాకింగ్ గా అనిపిస్తుంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సమంత ఇప్పుడే ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది..? నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడం పట్ల కడుపు మండిపోతుందా..? అన్న రేంజ్ లో కూడా ట్రోల్ చేస్తున్నారు..!