అక్కినేని ఇంట పెళ్లి భాజాలు మోగనున్న విషయం అందరికీ తెలిసిందే. అక్కినేని నాగచైతన్య - శోభిత దూళిపాళతో అన్నపూర్ణ స్టూడియోలో ఏడు అడుగులు వేయబోతున్నారు.అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య డిసెంబర్ 4వ తేదీన వివాహం జరగబోతోంది. అయితే ఈ శుభ ఘడియల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండగా.. మరో అక్కినేని హీరో అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు..

ఆయన ఎవరో కాదు అక్కినేని అఖిల్. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఈయన సడన్గా నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ,అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంత సడన్ ట్విస్ట్ ఇచ్చావ్ ఏంటి గురు అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. అఖిల్ అక్కినేని పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ నాగార్జున అక్కినేని స్వయంగా తెలిపారు.  జైనాబ్ రావ్ జీ తో అఖిల్ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు.  ఆమెను ప్రేమ మరియు ఆశీర్వాదాలతో తమ కుటుంబంలోకి సాదరంగా స్వాగతిస్తున్నామని తెలిపారు.

ఇక తన సోషల్ మీడియా ఖాతా ఇంస్టాగ్రామ్ లో కూడా అఖిల్ తన అభిమానులతో సంతోషకరమైన క్షణాన్ని పంచుకుంటూ క్యాప్షన్ కూడా జోడించారు. నాకు "ఇప్పటికీ ఒక తోడు దొరికింది. జైనాబ్ రావ్ జీ తో నేను సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నాను అంటూ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది.." అంటూ ఆమెతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ క్యాప్షన్ జోడించారు అఖిల్ అక్కినేని. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఇద్దరి పెళ్లిని ఒకేసారి చేస్తారా లేక విడివిడిగా వివాహం జరిపిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికైతే రెండు పెద్ద వేడుకలతో అక్కినేని కుటుంబానికి ఇది సంతోషకరమైన సమయం అని చెప్పవచ్చు. ఇక త్వరలోనే పెళ్లితో ఈ రెండు జంటలు ఒక్కటి కాబోతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: