ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలు తమిళ దర్శకులతో సినిమాలు చాలా వరకు చేస్తూ వస్తున్నారు. అందులో చాలా తక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మధ్య కాలంలో విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఓ ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు ఓ తమిళ డైరెక్టర్ తో సినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో నెల్సన్ దిలీప్ కుమార్ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం తమిళ స్టార్ హీరో అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా జైలర్ అనే మూవీ ని రూపొందించాడు.

మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక జైలర్ మూవీ కి కొనసాగింపుగా ఈయన జైలర్ 2 మూవీ ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత ఈయన తెలుగు స్టార్ హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు ఆ సినిమా జైలర్ 2 తర్వాతే స్టార్ట్ కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో కొన్ని రోజుల క్రితం ఈ మూవీ యూనిట్ చెన్నై లో ఓ ఈవెంట్ నిర్వహించింది.

ఈవెంట్ కి నెల్సన్ దిలీప్ కుమార్ కూడా వచ్చాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు అది జైలర్ 2 తర్వాత రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. దీనితో నెల్సన్ దిలీప్ కుమార్ "జైలర్ 2" మూవీ తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలలో ఎవరితో సినిమా చేస్తాడా ... లేక ఈ ఇద్దరితో కాకుండా వేరే వారితో సినిమా చేస్తాడా అనేది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: