ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో దాదాపు 5 సంవత్సరాల క్రితం పుష్ప అనే మూవీ స్టార్ట్ అయ్యింది. 2019 వ సంవత్సరం అక్టోబర్ 30 వ తేదీన పుష్ప మూవీ ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇక ఈ మూవీ ని మొదలు పెట్టినప్పుడు ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమాను కేవలం ఒకే భాగంతో విడుదల చేయాలి అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా నిడివి పెరగడంతో ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయాలి అని ఆలోచనకు వచ్చారు. ఈ విషయాన్ని సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో కూడా తెలియజేశాడు.

సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమాను ఒకే భాగంతో చేయాలి అనుకున్నాము. కానీ ఈ సినిమా సగ భాగం షూటింగ్ పూర్తి అయ్యే సరికి ఎడిటింగ్లో మూడు గంటల రన్ టైమ్ వచ్చింది. దానితో ఈ మూవీ ని రెండు భాగాలుగా చేయాలి అనుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమా మొదటి భాగం స్టార్ట్ అయిన తర్వాత కరోనా రావడంతో ఈ మూవీ మొదటి భాగం షూటింగ్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టింది. ఇక 2021 వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ మూవీ మొదటి భాగం విడుదల అయింది. ఇక ఈ సినిమా మొదటి భాగం అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

దానితో ఈ సినిమా రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక తాజాగా ఈ రోజు ఈ సినిమా రెండవ భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. దాదాపు 5 సంవత్సరాల పుష్ప ప్రయాణం ఈ రోజుతో ముగిసినట్లు అయ్యింది. మరి పుష్ప పార్ట్ 2 మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa