ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం అక్కినేని అఖిల్ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు నాగచైతన్య శోభితల మ్యాటర్ హాట్ టాపిక్ గా ఉంటే ప్రస్తుతం అఖిల్ జైనబ్ ల పెళ్లి వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే సడన్ గా ఈయన ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు నాగార్జున ప్రకటించడంతో అందరూ నోరెళ్లబెట్టారు. అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఆయన కి కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఏంటి.. ఆయన తండ్రి ఎవరు..ఆయన ఏం చేస్తుంది.. ఇలా ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా మరో షాకింగ్ విషయం నెట్టెంట వినిపిస్తోంది. అదేంటంటే అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకోబోయే జైనబ్ రావ్ డ్జి కి ముందే పెళ్లయి విడాకులు అయ్యాయిఅంటూ ఒక రూమర్ మీడియాలో వినిపిస్తుంది.కానీ ఈ రూమర్ లో ఉన్నది ఎంత నిజమో మాత్రం తెలియదు. 

ఇక అఖిల్ కి కాబోయే భార్య థియేటర్ ఆర్టిస్టు అలాగే పెయింటర్ అని కూడా తెలుస్తోంది.అంతేకాకుండా అఖిల్ కి కాబోయే భార్య జైనబ్ తండ్రికి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దగ్గర సంబంధాలు ఉన్నాయట. అలాగే జగన్ సీఎం గా ఉన్న సమయంలో జైనబ్ తండ్రి జుల్ఫీ రావడ్జి కి ఏపీ కేబినెట్ ర్యాంక్ గల్ఫ్ దేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి పదవి కూడా ఇచ్చారట.ఇక నాగార్జునకి జుల్ఫీ రావడ్జికి మధ్య సంబంధం ఏంటంటే.. వీరిద్దరూ బిజినెస్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి కొన్ని బిజినెస్ లు చేశారట.అలా బిజినెస్ పార్ట్నర్స్ కాస్తా వియ్యంకులుగా మారిపోయారు.

 ఇక అక్కినేని అఖిల్ గతంలో శ్రియ భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నారు..ఇక ఆ అమ్మాయి కూడా అఖిల్ కంటే వయసులో పెద్దదే. ఇక తాజాగా పెళ్లికి రెడీ అయిపోయిన జైనబ్ రావడ్జి కూడా అఖిల్ కంటే పెద్దదేనని తెలుస్తోంది.ఆమె అఖిల్ కంటే దాదాపు 9 ఏళ్ళు పెద్దదని సమాచారం. మరి అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి అప్పటికే పెళ్లయి విడాకులు అయ్యాయి అనే వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.ఇక తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటుందా..లేక నాగచైతన్యతో పాటు ఒకేసారి పెళ్లి చేస్తారా అనేది తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: