ఇలాంటి క్రమంలోనే ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది . అఖిల్ - జైనబ్ ల మధ్య ప్రేమ పుట్టడానికి పరోక్షకంగా కారణం స్టార్ హీరో భార్య మిహికా బజాజ్ అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మిహికా బజాజ్ చాలా చాలా క్లోజ్ . రానా - మిహికా పెళ్ళికి కూడా జైనబ్ వచ్చిందట. అక్కడే అఖిల్ తో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తుంది . ఆ పరిచయం స్నేహంగా మారి .. ఆ స్నేహం ప్రేమగా మారింది అని ఇప్పుడు ఆ ప్రేమ పెళ్లి బంధంగా మార్చుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
అంతేకాదు అఖిల్- జైనబ్ ల ప్రేమకు పరోక్షకంగా కారణమైంది మిహికా అంటూ ఓ రేంజ్ లో ఈ వార్తను ట్రెండ్ చేసేస్తున్నారు జనాలు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళ పెళ్లి మార్చి 17వ తేదీ జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 4వ తేదీ అక్కినేని నాగచైతన్య -శోభిత ధూళీపాళ్ళ పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరగబోతుంది. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జునను భలే ట్రోల్ చేశారు జనాలు. ఇద్దరు కొడుకులను లైఫ్ లో సెటిల్ చేయలేకపోయాడు ..అసలు ఇతను ఏ హీరో అంటూ దారుణంగా ట్రోల్ చేశారు . అలాంటి వాళ్లకు సైలెంట్ గానే షాక్ ఇచ్చేసాడు అక్కినేని నాగార్జున. ఇద్దరు కొడుకులకు బ్యాక్ టు బ్యాక్ మంచి అమ్మాయిలను చూసి పెళి చేయడానికి ముహూర్తాలను కూడా ఫిక్స్ చేసుకున్నారు . దీంతో సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జునను బాగా పొగిడేస్తున్నారు అక్కినేని అభిమానులు..!