ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమ బాగా దూసుకుపోతోంది. విచిత్రం ఏంటంటే విజయాల శాతం చాలా తక్కువగా ఉన్నా కూడా హీరోలతో పాటు హీరోయిన్లు .. దర్శకులు ... టెక్నీషియన్ రెమ్యూనరేషన్లు అటు సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోతుంది. టాలీవుడ్ లో చూస్తున్న అటు కోలీవుడ్లో చూసుకున్న .. బాలీవుడ్ లో చూసిన ఎక్కడ చూసినా కూడా ఏడాదికి 10 నుంచి 15 శాతానికి మించి సినిమాలు హిట్ కావటం లేదు. సినిమాలు వరుసగా ప్లాప్ అయినా కూడా ఏడాదికి ఏడాదికి హీరోలు తమ బడ్జెట్ అమాంతం పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు హీరోల రెమ్యూనరేషన్లు చుక్కల్లో ఉంటున్నాయి. ప్రస్తుతం డిజిటల్ యుగం కావడంతో ఓటీటీ నుంచి భారీ రేట్లు వస్తున్నాయి. ఇవన్నీ లెక్కలు వేసుకుని హీరోలు ఇష్టం వచ్చినట్టు రెమ్యూనరేషన్లు పెంచుకుంటూ వెళుతున్నారు. తాజాగా డిసెంబర్ 5న పుష్ప 2 ది రూల్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ సినిమా ప్రేమికులను ఉత్తేజ పరచటానికి వస్తున్న మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెమ్యునరేషన్ దేశవ్యాప్తంగా చర్చకి వచ్చింది.
ఈ సినిమా కోసం బన్నీ తీసుకున్న రెమ్యూనరేషన్ అక్షరాల 300 కోట్ల రూపాయలు అంటూ ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా తన ప్రత్యేక కథనంలో వెల్లడించింది. ఒక్క సినిమాకు 300 కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు ... కనీ విని ఎరుగని సంచలనం ఇది. దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోగా బన్నీ రికార్డుల్లో నిలిచారు. ఈ క్రమంలోనే ఈ కథనంలో ఫోర్బ్స్ 2024 లో అత్యధిక పారితోషకం తీసుకున్న టాప్ - 10 నటుల జాబితాని విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్ రు. 300 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఇక కోలీవుడ్ హీరో విజయ్ ఇటీవల వచ్చిన ది గోట్ సినిమాతో పాటు తన 69వ సినిమా కోసం రు. 275 కోట్లు తీసుకుంటున్నాడట. ఇక మూడో స్థానంలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఉన్నారు. ఢంకీ సినిమా కోసం ఆయన రు. 250 కోట్ల పారితోషకం అందుకున్నారట. అలాగే రజనీకాంత్ రు. 150 కోట్లు - అమీర్ ఖాన్ 200 కోట్లకు కాస్త అటు ఇటుగా ప్రభాస్ కూడా 200 కోట్లు ... మరో తమిళ స్టార్ హీరో అజిత్ రు. 165 కోట్లు - సల్మాన్ ఖాన్ రు. 150 కోట్లు - అలాగే కమల్ హాసన్ 150 కోట్లు - అక్షయ్ కుమార్ 145 కోట్లు తర్వాత స్థానాల్లో ఉన్నట్టు ఫోర్బ్స్ తెలిపింది.