అయితే నయనతార తన పెళ్లి వీడియోని నెట్ ఫిక్స్ కి ఇచ్చేసినట్లుగా.. అటు శోభిత ,నాగచైతన్య ఇద్దరు కూడా తమ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సైతం నెట్ ఫ్లిక్స్ కు రూ .50 కోట్లకు అమ్మేసినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయాన్ని అభిమానులు విని ఆశ్చర్య పోవడంతో అటు అక్కినేని కుటుంబం మీద కాస్త అభిమానులు కాస్త పెదవి విరిచారు.. అయితే ఇలాంటి విషయం మీద అక్కినేని కుటుంబ టీమ్ స్పందిస్తూ నెట్ ఫ్లిక్స్ విషయంపై వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదంటూ కొట్టి పారేసింది. దీన్ని బట్టి చూస్తే అక్కినేని కుటుంబ సభ్యులు నాగచైతన్య శోభిత వివాహాన్ని ఏ ఓటీటీ సంస్థకు అప్పగించలేదని తేలిపోతొంది.
ప్రస్తుతం పెళ్లి పనులలో బిజీగా ఉన్న అటు అక్కినేని కుటుంబ శోభిత కుటుంబం పెళ్లి బట్టలను కూడా చాలా సాంప్రదాయంగా ఉండేలా సాంప్రదాయమైన పద్ధతిలో ఉండేలానే చూసుకుంటున్నారట. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫోటోలను కూడా శోభిత, నాగచైతన్య ఇద్దరు షేర్ చేయడం జరిగింది. అలాగే సడన్ షాకిస్తూ అఖిల్ ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా నాగచైతన్య షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇద్దరి పెళ్లికూడా ఒకే రోజున ఒకే సమయంలో జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది అక్కినేని అభిమానులకు డబల్ గుడ్ న్యూస్ ఆయన అఖిల్ పెళ్లి పైన ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.