మరీ ముఖ్యంగా చెన్నైలో జరిగిన మ్యూజికల్ ఈవెంట్లో బన్నీ మాట్లాడిన పద్ధతి ..బన్నీ బిహేవ్ చేసిన తీరు జనాలకి ఆశ్చర్యకరంగా అనిపించింది . అంతేకాదు చెన్నై గడ్డపై ఆయన చిందులు వేయడం కూడా అభిమానులకి సర్ప్రైజ్ ఇవ్వగా జనాలకి ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా బన్నీ ఏ స్టేజిపై డాన్స్ చేయడు ..ఎక్కడో అరా కొరా చేస్తూ కనిపించాడు . కానీ పుష్ప2 లాంటి స్టార్ బిగ్ బడా సినిమాలో నటించిన తర్వాత కూడా అల్లు అర్జున్ తన సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి అంత పెద్ద స్టేజ్ పై అది కూడా చెన్నై గడ్డపై ఆయన స్టెప్స్ వేయడం సంచలనంగా మారింది.
దీంతో చాలామంది స్టార్స్ కూడా బన్నీ బిహేవియర్ ను తప్పుపడుతూ మాట్లాడుకుంటున్నారు . ఇదే క్రమంలో ఇండస్ట్రీలో స్టార్ హీరో పుష్ప 2 సినిమాపై నెగటివ్ గా మాట్లాడుతున్నాడు అన్న వార్త బాగా వైరల్ గా మారింది. పుష్ప వైల్డ్ ఫర్ కాదని ఇండస్ట్రీకి బిగ్ మిస్ ఫెయిర్ అని కచ్చితంగా ఈ సినిమా బన్నీ కెరియర్ లో డిజాస్టర్ గా మిగిలిపోతుంది అంటూ ఆ స్టార్ హీరో తన క్లోజ్ సర్కిల్లో మాట్లాడడం అందరికి షాకింగ్ గా అనిపిస్తుంది అంటున్నారు అభిమానులు . ఇండస్ట్రీలో అంత పెద్ద స్టార్ హీరో అలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు న్యాయం ..? పుష్ప2 సినిమా హిట్ అవుతుందా..? ఫట్ అవుతుందా..? పక్కన పెడితే బన్నీ కష్టపడిన తీరుకైన అప్రిసియేషన్ ఇవ్వాలిగా అంటున్నారు జనాలు. చూడాలి డిసెంబర్ ఐదవ తేదీ వీళ్ళందరి నోర్లు మూయిస్తాడా లేదా ..? బన్నీ..?