అక్కినేని నాగార్జున ఇంట మరో పెళ్లి జరగబోతుంది .. త్వరలోనే అక్కినేని నాగార్జున రెండో కొడుకు అఖిల్ పెళ్ళికి రెడీ అవుతున్నాడు .. దీనికి సంబంధించిన కీలక విషయాని కూడా నాగార్జున సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. ముంబై నటి జైనాబ్ రవద్జీని అఖిల్ అక్కినేని గత మంగళవారం సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు . ఇదే విషయాన్ని నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా ఫోటోలతో అందరికీ తెలియజేశారు.  ఆ పోస్టులో నాగార్జున జైనాబ్‌ని మా కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. దయచేసి యువ జంటను అభినందించడానికి మాతో చేరండి మరియు వారి జీవితకాలం ప్రేమ, ఆనందం మరియు మీ లెక్కలేనన్ని ఆశీర్వాదాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు..


ఇక అఖిల్ చాలా కాలం నుంచి నటి జైనాబ్ రవద్జీన తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది . ఇక వీరిద్దరూ పీక‌లోతు ప్రేమలో ఉన్నారని ప్రస్తుతం వీరిద్దరూ తమ రిలేషన్‌ను పెళ్లి గా మార్చుకోవాలని భావిస్తున్నారున్నారు . అయితే నాగార్జున కాబోయే చిన్న కోడలు కూడా సినిమాల్లో హీరోయిన్గా నటించిన.. ఈ చిన్నది పలు మరాఠి సినిమాల్లో హీరోయిన్గా నటించిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాలకు చెప్పడం తో వారు ఒకే చెప్పడం అన్ని కూడా చక చక జరిగిపోయాయని తెలుస్తుంది .. అటు నాగార్జున కూడా అఖిల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్ని అనుకున్నట్లు జరిగితే అఖిల్ పెళ్లి వచ్చే ఏడాది జనవరి లో జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ..


ఇక  ప్రస్తుతం వీరిద్ద‌రి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే..అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత అఖిల్ నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. బ్యాచ్‌లర్ సినిమానే యావరేజ్‌గా నిలిచింది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఈసారైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. దీంతో సినిమాల నుంచి అఖిల్ కొంత గ్యాప్ తీసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: