అయితే ఫహద్ ఫాజిల్ తండ్రి మలయాళం లో 80, 90 వ దశకంలో అగ్ర దర్శకులలో ఒకరుగా ఉన్నాడు. తమిళం , మలయాళం భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. రజనీకాంత్ చంద్రముఖి మాతృక అయిన మలయాళం మూవీ మణిచిత్రతాజుకు ఫహాద్ ఫాజిల్ తండ్రి దర్శకుడుగా వ్యవహరించారు . మలయాళం లో ముమ్ముట్టి , మోహన్‌లాల్ , సురేష్ గోపి , తమిళంలో దళపతి విజయ్ , కార్తీక్ , ప్రభు వంటి హీరోలకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు ఫాజిల్.. తన 30 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరియర్ లో 30 కు పైగా సినిమాలకు దర్శకుడుగా ప్రవహించగా.. పది కి పైగా సినిమాలను నిర్మించాడు ఫాజిల్. దర్శకుడుగా తన కెరియర్లో ఫాజిల్ ఓ తెలుగు సినిమాని కూడా తెరకెక్కించాడు.
నాగార్జున హీరోగా వచ్చిన కిల్లర్ మూవీ యాక్షన్ థ్రిల్లర్ కథాంశం తో 1992 లో రిలీజ్ అయిన ఈ మూవీ కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాకు ఇళయరాజా అందించిన పాటలు కూడా ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ముందుగా కిల్లర్ సినిమా ని మలయాళం లో మోహన్ లాల్ తో చేయాలని ఫాజిల్ అనుకున్నారట. అయితే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కొంత నెగిటివ్ రోల్ లో ఉండటంతో అప్పుడప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరవుతున్న మోహన్‌లాల్ కిల్లర్ మూవీ చేయడానికి ముందుకు రాలేదట. ఇక దాంతో కిల్లర్ మూవీని నాగార్జునతో తెర్కక్కించాడు ఫాజిల్. ఈ సినిమాను టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ ప్రొడ్యూస్ చేశాడు. కిల్లర్ మూవీలో నగ్మా హీరోయిన్‌గా నటించగా... శారత, బేబీ షామిలి కీలక పాత్రల్లో నటించారు. కిల్లర్ తర్వాత తెలుగులో ఫాజిల్‌కు డైరెక్టర్‌గా అవకాశాలు వచ్చినా తమిళం, మలయాళ భాషల్లో బిజీగా ఉండటంతో సినిమాలు చేయలేకపోయారు.