మెగాస్టార్ తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యానైతే చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే దాని కోసం ఎంతటి రిస్క్ అయిన చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని ఎప్పటికప్పుడు తన నటనతో చూపిస్తూ వస్తున్నాడు. ఇక తన ఎంటైర్ కెరియర్ లో మగధీర లాంటి ఒక ఇండస్ట్రీ హిట్ దక్కడమే కాకుండా ఇండస్ట్రీకి వచ్చిన రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరోగా కూడా రామ్ చరణ్ హిస్టరీని క్రియేట్ చేశాడు.ఇదిలావుండగా రాంచరణ్ లాంగ్ హెయిర్ గురించి రామ రాజమౌళి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. అవేమిటంటే మగధీర లో రాంచరణ్ తో హార్స్ రైడింగ్ సీన్లు, యోధుడిగా భారీ ఫైట్స్ చేసే సన్నివేశాలతో సినిమా చేస్తున్నాం అని చెప్పారు. భారీ బడ్జెట్ అని కూడా చెప్పారు. నేను చరణ్ అప్పటి వరకు నేరుగా చూడలేదు. చిరుత చిత్రంలోనే చూశాను. చిరుత మూవీ చూస్తున్నప్పుడు రాంచరణ్ కళ్ళు చాలా పవర్ ఫుల్ గా అనిపించాయి. కరెక్ట్ గా ప్రెజెంట్ చేస్తే స్క్రీన్ ప్రెజన్స్ బావుంటుంది అని అనుకున్నా.మగధీర లుక్ టెస్ట్ కోసం ఫస్ట్ టైం రాంచరణ్ ని నేరుగా మీట్ అయ్యా. అప్పుడు చరణ్ ని చూసినప్పుడు కళ్ళతో పాటు హెయిర్ అద్భుతంగా ఉంది అనిపించింది. వెంటనే రాజమౌళితో ఆ అబ్బాయి హెయిర్ చాలా బావున్నాయి. హార్స్ రైడింగ్ సీన్లు ఉన్నాయి కాబట్టి గాల్లో హెయిర్ ఎగురుతుంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది అని రాజమౌళితో చెప్పినట్లు రమా రాజమౌళి అన్నారు. వెంటనే రాజమౌళి.. అవును హెయిర్ బాగా పెంచుదాం, ఎంత పొడవుగా వీలైతే అంత పెంచుదాం.. ఆ తర్వాత లుక్ డిసైడ్ చేద్దాం అని చెప్పారట.ఆ విధంగా మగధీరతో రాంచరణ్ లాంగ్ హెయిర్ లుక్ ఫైనల్ అయింది.ప్రస్తుతం ఈ న్యూస్ ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: