అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ళ పెళ్లి ఫిక్స్ చేసి సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోయేలా చేసిన అక్కినేని నాగార్జున . ఇప్పుడు తన చిన్న కోడల్ని ఏకంగా బడా సౌండ్ పార్టీనే తెచ్చుకోవడం హైలెట్ గా మారింది . త్వరలోనే అఖిల్ -జైనబ్ పెళ్లి జరగబోతుంది . ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది అక్కినేని కుటుంబం . ఇదే మూమెంట్లో అక్కినేని ఇంటికి కోడలు కాబోయే ఆడవాళ్ళల్లో ఉండే లక్షణాలకు సంబంధించిన డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా అక్కినేని ఇంటికి కాబోయే పెద్ద కోడళ్ళు చాలా సాఫ్ట్ గా ఉంటారు అని .. అదేవిధంగా అక్కినేని ఇంటికి చిన్న కోడలు అయ్యే వాళ్ళు మాత్రం మంచి జోష్ మీద ఉంటారు అని ఒక కొత్త న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు .
దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు. నాగార్జున ఫస్ట్ వైఫ్ లక్ష్మి చాలా సైలెంట్ అని ..అమల మాత్రం చాలా యాక్టివ్ చాలా నాటి ఫెలో అని చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా నాగచైతన్య ఫస్ట్ వైఫ్ సమంత చాలా సైలెంట్ అని ..శోభిత చాలా చాలా నాటి ఫెలో అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఇక అక్కినేని అఖిల్ కి కాబోయే రెండో భార్య గురించి ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అందరికన్నా కూడా టాలెంటెడ్ కూడా అంటూ గతంలో అఖిల్ నిశ్చితార్ధం చేసుకుని బ్రేకప్ చెప్పేసుకున్నా శ్రేయ భూపాల్ సైలెంట్ పర్సన్ అని గుర్తు చేసుకుంటున్నారు. దీంతో అక్కినేని ఇంటికి ఇది ఒక సాంప్రదాయంలో మారిపోయింది అని .. పెద్ద కోడలు సైలెంట్ గా ఉంటే చిన్న కోడలు మాత్రం నాటీ గా ఉంటారు అన్న విషయాన్ని జనాలు బాగా ట్రెండ్ చేస్తున్నారు..!